Home Actor అంచ‌నాలు పెంచేసిన డియర్ కామ్రేడ్ ట్రైల‌ర్.

అంచ‌నాలు పెంచేసిన డియర్ కామ్రేడ్ ట్రైల‌ర్.

42
0
అంచ‌నాలు పెంచేసిన డియర్ కామ్రేడ్ ట్రైల‌ర్. spiceandhra

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం డియ‌ర్ కామ్రేడ్. ఈ చిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. విజ‌య్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తోంది. వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డంతో ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పాట‌ల‌ను రిలీజ్ చేసిన ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈ రోజు డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసింది.

హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్, రొమాన్స్, ఎమోష‌న్.. అలాగే యాక్ష‌న్..స‌న్నివేశాల‌తో ఈ ట్రైల‌ర్ ను క‌ట్ చేసారు. విజ‌య్, ర‌ష్మిక క్యారెక్ట‌ర్స్ ఎలా ఉంటాయో చూపించారు. యూత్ ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. ఈ ట్రైల‌ర్ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే… విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ లో మ‌రో హిట్ సినిమా అనిపిస్తుంది.

తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 26న ప్ర‌పంచ వ్యాప్తంగా డియ‌ర్ కామ్రేడ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి… డియ‌ర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచ‌ల‌న సృష్టిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here