Home Uncategorized అంచ‌నాల‌ను పెంచేసిన‌ గీత గోవిందం టీజ‌ర్..!

అంచ‌నాల‌ను పెంచేసిన‌ గీత గోవిందం టీజ‌ర్..!

161
0
Geetha govindam Teaser

అర్జున్ రెడ్డి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించి..యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న తాజా చిత్రం గీత గోవిందం. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న న‌టించింది.   ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో  నిర్మిస్తోన్న ఈ  చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలే.. పాటకు విశేష స్పంద‌న ల‌భించింది. ఇక ఈ మూవీ టీజ‌ర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే…రైతు వేషధారణలో ట్రాక్టర్ నడుపుతూ విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. ఆ సమయంలో రేడియోలో వస్తోన్న ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది .. సాంగ్ లో తననీ .. భార్యని ఊహించుకుంటాడు. ఈ సాంగ్ కి త‌గ్గ‌ట్టుగా బ్లాక్ అండ్ వైట్ లో చూపించడం బాగుంది.

ఇక‌హీరోయిన్ ర‌ష్మిక మంద‌న… ఇంకోసారి అమ్మాయిలూ .. ఆంటీలు .. ఫిగర్లు అంటూ తిరిగావంటే .. యాసిడ్ పోసేస్తాను అంటూ  హీరోకు వార్నింగ్ ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. అన్నింటి కంటే…లాస్ట్ లో ఇక మార‌వా నువ్వు అని హీరోయిన్ అంటే…లేదు మేడ‌మ్ నేను మారిపోయా. ఐయామ్ కంప్లీట్ లి డిసెంట్ నౌ అని చెప్ప‌డం చాలా బాగుంది. ఆడియోను ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here