Home Actor అంచ‌నాల‌ను పెంచేసిన మ‌న్మ‌థుడు 2 ట్రైల‌ర్.

అంచ‌నాల‌ను పెంచేసిన మ‌న్మ‌థుడు 2 ట్రైల‌ర్.

20
0
అంచ‌నాల‌ను పెంచేసిన మ‌న్మ‌థుడు 2 ట్రైల‌ర్. spiceandhra

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం మ‌న్మ‌థుడు. ఈ సినిమా 2002లో రిలీజైంది. ఇప్పుడు 17 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌న్మ‌థుడు 2 టైటిల్ తో నాగార్జున సినిమా చేసిన విష‌యం తెలిసిందే. చి ల సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నాగార్జున స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది.  ఈ రోజు మ‌న్మ‌థుడు 2 ట్రైల‌ర్ రిలీజ్ చేసారు.

ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన రెండు టీజ‌ర్స్ బాగా ఆక‌ట్టుకున్నాయి. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే… నాగార్జున స్టైల్లో రొమాన్స్, వెన్నెల కిషోర్, రావు రమేష్ కామెడీ, మనసుకు హత్తుకునే ఎమోషనల్ డ్రామా..ఇలా ఒక‌టేమిటి ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి అనిపిస్తుంది.

అద్భుతం.. అమోఘం.. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. హమ్మీ గో.. అంటూ కారులో వెన్నెల కిషోర్ పక్కన కూర్చొని మంచి జోష్‌తో నాగార్జున చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలైంది. మీరెప్పుడూ ప్రేమలో పడలేదా?’ అని రకుల్ అడిగితే.. ‘ఒకపూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను’  అని చెప్పిన‌ సమాధానం బ‌ట్టి ఈ మూవీలో నాగ్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు. టోట‌ల్ గా ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేసింది.

మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్టు 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. డైరెక్ట‌ర్ రాహుల్ రెండో సినిమాతో కూడా స‌క్స‌స్ సాధించేలా ఉన్నాడు. మ‌రి.. మ‌న్మ‌థుడు 2 ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here