Home Actor అంచ‌నాల‌ను పెంచేసిన మ‌ల్లేశం ట్రైల‌ర్..!

అంచ‌నాల‌ను పెంచేసిన మ‌ల్లేశం ట్రైల‌ర్..!

66
0

 చేనేత కార్మికుల కష్టాలను తగ్గించడం కోసం ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం ఆధారం తెరకెక్కిన చిత్రం మల్లేశం. ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్‌ యాన్‌ ఆర్డినరీ మ్యాన్‌ అనేది ట్యాగ్ లైన్.  ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించాడు. రాజ్‌ ఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మార్క్‌ కే రోబిన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 157 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్.. సినిమా ఎలా ఉండనుందో ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఇచ్చింది.

స్కూళ్లో పిల్లలు చిరంజీవి సినిమా స్టోరీ చెప్పే సీన్ నుంచి ఈ ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. మల్లేశం లవ్ స్టోరీ, ఫ్రెండ్స్‌తో సరాదాగా సాగే ఘటనలు.. తల్లి కష్టం చూడలేక ఆసు యంత్రం కనిపెట్టే క్రమంలో పడే శ్రమ, ఎదుర్కొన్న ఛీత్కారాలు.. ఇవన్నీ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. చివర్లో ముందుంది ముసళ్ల పండుగ.. సినిమా చూసి దీవించుండ్రి నిండుగా… అని ప్రియదర్శి చెప్పే డైలాగ్‌తో ముగుస్తుంది.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా… ఈ సినిమాని తెర‌కెక్కించారు డైరెక్టర్ రాజ్ ఆర్. మల్లేశం జీవితాన్ని యథాతథంగా చూపించే ప్రయత్నం చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైల‌ర్ కు విశేష స్పంద‌న వ‌స్తుంది. జూన్ 21న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here