Home News Movie News అంచ‌నాల‌ను పెంచేసిన విన‌య విధేయ రామ టీజ‌ర్.!

అంచ‌నాల‌ను పెంచేసిన విన‌య విధేయ రామ టీజ‌ర్.!

9
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్ లో సినిమా అని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. డీవీవీ దాన‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈరోజు ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసారు. విన‌య విధేయ రామ అని టైటిల్ క్లాస్ గా ఉన్నా..టీజ‌ర్ మాత్రం ఫుల్ మాస్ తో అదిరింది.

టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే… అన్నయ్య వీడిని చంపెయ్యాలా? భయపెట్టాలా?’ అనే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. భయపెట్టాలంటే 10 నిమిషాలు చంపేయాలంటే పావుగంట. ఏదైనా ఓకే సెలక్ట్ చేసుకో’ అంటూ చర‌ణ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్క‌డ‌ రామ్ కొ..ణి..దె..ల అంటూ చర‌ణ్ చెప్పిన డైలాగ్ మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. వివేక్‌ ఒబెరాయ్ విల‌న్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి…విన‌య విధేయ రామ అంటూ చ‌ర‌ణ్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here