Home Movie News అంచ‌నాల‌ను పెంచేస్తోన్న స‌వ్య‌సాచి టీజ‌ర్..!

అంచ‌నాల‌ను పెంచేస్తోన్న స‌వ్య‌సాచి టీజ‌ర్..!

102
0
DoZW2_6VsAA0qgt

అక్కినేని నాగ చైత‌న్య – ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ స‌వ్య‌సాచి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టించింది. భూమిక‌, మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. చైతు – చందు కాంబినేష‌న్ లో రూపొందిన ప్రేమ‌మ్ సూప‌ర్ స‌క్స‌స్ సాధించ‌డంతో స‌వ్య‌సాచి కూడా ఖచ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌నే టాక్ ఉంది. ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు స‌వ్య‌సాచి టీజ‌ర్ ను చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే…దీనిలో ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న మంచి క‌థ ఉంద‌నే ఫీలింగ్ క‌లిగించింది.అలాగే యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్ తో పాటు మెడిక‌ల్ ట‌చ్ కూడా ఉంది. ఈ టీజ‌ర్ చివ‌రిలో చైత‌న్య ఒంటి చేత్తో రౌడిని పైకి లేపే సీన్ చూస్తుంటే..మాస్ ఆడియ‌న్స్ కి కావ‌ల‌సిన అంశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌నిపిస్తుంది. ఈ చిత్రానికి స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. న‌వంబ‌ర్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి…చైత‌న్య చేస్తోన్న ఈ మాస్ ప్ర‌య‌త్నం ఈసారైన స‌క్సస్ అందిస్తుంద‌ని ఆశిద్దాం.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here