Home Movie News అంచ‌నాల‌ను పెంచేస్తోన్న‌ స‌వ్య‌సాచి సాంగ్..!

అంచ‌నాల‌ను పెంచేస్తోన్న‌ స‌వ్య‌సాచి సాంగ్..!

90
0

అక్కినేని నాగ చైత‌న్య – చందు మొండేటి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్నినిర్మిస్తోంది. చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టించిన‌ ఈ చిత్రంలో భూమిక‌, మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. వైవిధ్య‌మైన‌ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా న‌వంబర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసిన ఈ చిత్ర యూనిట్ ఒక్కొక్క పాట‌ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేస్తుంది.

తాజాగా స‌వ్య‌సాచి అనే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. సంస్కృత ప‌దాల‌తో చండ మార్తాండ భా మండలీ.. అంటూ చాలా గంభీరమైన సాహిత్యంతో మొదలవుతుందీ పాట. ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత‌ శివశక్తి ద‌త్తా ఈ పాట‌ను రాసారు. ఆయ‌న‌ ఏ పాట రాసినా.. సంస్కృత పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పాట వింటుంటే బాహుబ‌లి సినిమాలోభళి భ‌ళి భ‌ళిరా…పాట గుర్తొస్తుంది. ఈ పాట‌ను కూడా ఈయ‌నే రాసారు. అయితే…సినిమాలో కీల‌క సంద‌ర్భంలో వ‌చ్చే ఈ పాట సినిమా పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింద‌ని చెప్ప‌చ్చు.  చైతు ఫ్యాన్స్ ఈ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి..స‌వ్య‌సాచి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ఆశిద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here