Home Actor అంతా క్షేమం – రామ్ చ‌ర‌ణ్..!

అంతా క్షేమం – రామ్ చ‌ర‌ణ్..!

107
0

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం సెట్ లో మంట‌లు  చెల‌రేగి సెట్‌ కాలిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. కోకాపేటలో సైరా కోసం వేసిన సెట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని వార్త‌లు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌ ఈ విషయాన్ని అధికారంగా ధృవీకరించారు.

ఈ ఘటన పై రామ్ చ‌ర‌ణ్ ఫేస్ బుక్ లో స్పందిస్తూ…కోకాపేటలో వేసిన సైరా సెట్‌ ఈ ఉదయం దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఏ ఒక్కరికి ప్రమాదం జరగలేదు. టీమ్ మెంబ‌ర్స్ అంతా క్షేమంగా ఉన్నారు. మా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని తెలియజేశారు. అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, జ‌గ‌ప‌తి బాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here