Home Movie News అంత‌రిక్షం టీజ‌ర్ అదిరింది..!

అంత‌రిక్షం టీజ‌ర్ అదిరింది..!

83
0

మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం అంత‌రిక్షం 9000 కెఎమ్‌పిహెచ్. ఈ చిత్రాన్ని ఘాజీ ఫేమ్ సంక‌ల్ప‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఘాజీ సినిమాతో స‌రికొత్త చిత్రాన్ని అందించిన సంక‌ల్ప‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ సినిమా పై ప్రారంభం నుంచి మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈరోజు అంత‌రిక్షం టీజ‌ర్ రిలీజ్ చేసారు.

హై టెక్నికల్‌ వాల్యూస్‌, హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ సారధ్యంలో యాక్షన్‌ సీన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా వరుణ్ కెరియర్‌లో ఎప్ప‌టికీ నిలిచిపోయే సినిమా అవుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో పూర్తిస్థాయి అంతరిక్షం నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ప్ర‌తి ఫేమ్ క్వాలిటీతో ఉండ‌డం..వైవిధ్య‌మైన క‌థాంశం కావ‌డంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అనే ఫీలింగ్ క‌లిగించింది ఈ టీజ‌ర్.

తెలుగు సినిమా గ‌ర్వించేలా ఈ సినిమా ఉంటుంది అనిపిస్తుంది. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..అంత‌రిక్షం ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here