Home Political News అందుకే..కాంగ్రెస్ నేత‌లు భ‌య‌ప‌డి పారిపోతున్నారు – టీఆర్ఎస్ ఎంపీ వినోద్..!

అందుకే..కాంగ్రెస్ నేత‌లు భ‌య‌ప‌డి పారిపోతున్నారు – టీఆర్ఎస్ ఎంపీ వినోద్..!

96
0

తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసాయి. ఎవ‌రి ప్లాన్స్ తో వారు ప్ర‌చారం చేస్తూ..అవ‌తలి పార్టీ పై విమ‌ర్శ‌లు చేస్తూ.. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు  ఏం చేయ‌నున్నారో మేనిఫెస్టో ద్వారా కేసీఆర్ తెలియ‌చేసారు. ఇందులో నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం పై కాంగ్రెస్ నాయ‌కులు మండిప‌డుతున్నారు. గ‌త ఏడాది నుంచి కాంగ్రెస్‌ చెబుతున్న విషయాలను మక్కికి మక్కి కాపీ కొట్టి తమ మేనిఫెస్టోగా చెప్పుకొన్న దయనీయ స్థితికి టీఆర్‌ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేరుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు.

కాంగ్రెస్ విమ‌ర్శ‌ల పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పందిస్తూ…కాంగ్రెస్ నేత‌లు ఊహ‌ల్లో బ‌తుకుతున్నారు. గ‌త మేనిఫెస్టోలో చెప్పిన‌వి చేశాం. చెప్ప‌నివి చాలా చేశాం. కాంగ్రెస్ నేత‌లు ఇచ్చే హామీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌టం లేదు అన్నారు. 200 పెన్ష‌న్ ఇవ్వ‌ని వాళ్లు..2 వేలు ఇస్తారా..?  అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు అని చెప్పారు. అంద‌రితో చ‌ర్చించిన త‌ర్వాతే సీఎం కేసీఆర్ మేనిఫెస్టోని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీ అధినేత‌ చంద్ర‌బాబుతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుందో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పాలి అన్నారు. కోర్టుల‌కు కాదు ప్ర‌జా కోర్ట‌కు వెళ‌దాం అని కేసీఆర్ అంటే..కాంగ్రెస్ నేత‌లు భ‌య‌ప‌డి పారిపోతున్నారు. సీఎం కేసీఆర్ కు ప్ర‌జ‌ల దీవెన‌లు ఉన్నాయి. టీఆర్ఎస్ గెలుపు త‌థ్యం.కేసీఆర్ సీఎం కావ‌డం ఖాయం అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here