Home News అందుకే.. గాజు గ్లాసు కి ఓటేద్దాం ప‌వ‌న్ ని గెలిపిద్దాం – రాజ‌మండ్రి అర్బ‌న్ జ‌న‌సేన...

అందుకే.. గాజు గ్లాసు కి ఓటేద్దాం ప‌వ‌న్ ని గెలిపిద్దాం – రాజ‌మండ్రి అర్బ‌న్ జ‌న‌సేన అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌

78
0


రాజ‌మండ్రి అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుండి జ‌న‌సేన త‌రుపున పోటీ చేస్తోన్న అత్తి స‌త్య‌నారాయ‌ణ ఇంటింటికి వెళ్లి జ‌న‌సేన పార్టీ గెల‌వాల్సిన అవ‌స‌రాన్ని తెలియ‌చేస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌చారంలో భాగంగా జ‌న‌సేన మ్యానిఫెస్టో గురించి అత్తి స‌త్య‌నారాయ‌ణ తెలియ‌చేస్తూ… రేష‌న్ లో కుళ్లిపోయిన బియ్యం, చెడిపోయిన పప్పులు అది కూడా తీసుకోవ‌డానికి రెండు మూడు రోజులు మ‌హిళ‌లు రేష‌న్ షాపు చుట్టూ తిర‌గాల్సి వ‌స్తుంది. ఇలాంటి ప‌రిస్థితి లేకుండా నాణ్య‌మైన స‌ర‌కులు కొనుక్కోండి. ఆరోగ్యంగా ఉండండి అనే ఉద్దేశ్యంతో చిన్న కుటుంబానికి 2,500, పెద్ద కుటుంబానికి 3,500 ఇచ్చేలా ప‌థ‌కం గురించి మ్యానిఫెస్టోలో చెప్ప‌డం జ‌రిగింది.

అధికారంలో ఉన్న పార్టీలు కానీ…ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ కానీ..యువ‌త‌రాన్ని వాళ్ల పార్టీ జెండాని మోయ‌డానికి వాళ్ల వెన‌కాల తిర‌గడానికి వాడుకుంటున్నారు త‌ప్పా…యువ‌త‌కు ఏవిధ‌మైన స‌హాయ స‌హ‌కారాలు ఎప్పుడూ అందించ‌లేదు. మా నాయ‌కుడు యువ‌త‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప‌థ‌కాలు ప్ర‌వేశ‌ప‌ట్ట‌నున్నారు. ఈ రోజుల్లో విద్య ఎంత భారం అవుతుందో అంద‌రికీ తెలిసిందే. అందులోను కార్పోరేట్ సంస్థ‌లు విద్య పేరుతో ప్ర‌జ‌ల నుంచి బాగా డ‌బ్బులు లాగేస్తున్నాయి. అందుచేత ఉచిత విద్యా ప‌థ‌కం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఇలా…సామాన్యుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డేలా మ్యానిఫెస్టో రూపొందించారు. కాబ‌ట్టి గాజు గ్లాసు గుర్తు పై ఓటేసి జ‌న‌సేన పార్టీని గెలిపించాల‌ని కోరుతున్నాను అని అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here