Home Political News అందుకే..జ‌న‌సేన పార్టీలో చేరాను – నాదెండ్ల మ‌నోహ‌ర్.!

అందుకే..జ‌న‌సేన పార్టీలో చేరాను – నాదెండ్ల మ‌నోహ‌ర్.!

96
0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తిరుప‌తిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆత‌ర్వ‌త జ‌న‌సేన పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేత‌గా ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో చేర‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. జ‌న‌సేన పార్టీకి మ‌నోహ‌ర్ చేరిక మ‌నోబ‌లాన్ని ఇచ్చింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. జ‌న‌సేన పార్టీలో చేరిన త‌ర్వాత మ‌నోహ‌ర్ మీడియాతో మాట్లాడుతూ…త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు. భగవత్సంకల్పంతో జనసేనలో చేరాన‌ని మనోహర్‌ తెలిపారు. పార్టీలో చేరికకు తనకు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు లభించాయని చెప్పారు.

రాజకీయాల్లో ఎప్పుడు, ఏ మార్పు వస్తుందో ఊహించలేం. అయితే మనమెప్పుడూ ఓ కమిట్‌మెంట్‌తో పనిచేసి జనానికి దగ్గరగా ఉండాలి. మంచి ఆశ‌యంతో పార్టీని నడిపిస్తున్న పవన్‌ వెంట మనమంతా ఉండాలి అన్నారు. ఆయన ఆలోచనా విధానాలను, పార్టీ సిద్ధాంతాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని పిలుపిచ్చారు. పవన్ తో పలు విషయాల పై చర్చించాన‌ని.. ఐదు విషయాల్లో ఎక్కడా రాజీ లేకుండా ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నామని తెలియ‌చేసారు.

విలువలతో కూడిన రాజకీయం; మానవత్వంతో కూడిన రాజకీయం; దేశభక్తి, ప్రాథమిక విలువలను వీడకపోవడం; ప్రాంతాలు, మతాలు, కులాలకతీతమైన అభివృద్ధి; ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడం.. ఈ ఐదింటి పై మా ఉభయుల ఆలోచనలు ఒకేలా ఉన్నాయి అందుకే జ‌న‌సేన పార్టీలో చేరాన‌ని చెప్పారు. ఏ నాయకుడిలో కనిపించని భావోద్వేగం పవన్‌లో ఉంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here