Home News అందుకే…తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్థి నాదెండ్ల మ‌నోహ‌ర్ కి ఓటేద్దాం. మ‌రోసారి గెలిపిద్దాం..!

అందుకే…తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్థి నాదెండ్ల మ‌నోహ‌ర్ కి ఓటేద్దాం. మ‌రోసారి గెలిపిద్దాం..!

89
0


శాస‌న స‌భ‌కు ఉప స‌భాప‌తిగా, స‌భాప‌తిగా ప్ర‌జ‌లంద‌రికీ సుప‌రిచితులు, సౌమ్యులు, మృదుస్వ‌భావి నాదెండ్ల మ‌నోహ‌ర్. ఆయ‌న ఉస్మానియ యూనివ‌ర్శిటీలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు. రాజ‌కీయ నేప‌ధ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చినా క్రీడ‌ల పై ఉన్న మ‌క్కువ‌తో టెన్నీస్ క్రీడాల్లో ప్రావీణ్యం సంపాదించారు. మ‌న దేశం త‌రుపున ప‌లు అంత‌ర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. త‌న‌కు ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు ఇచ్చిన ఈ దేశానికి త‌న సొంత ఊరుకి ఎంతో కొంత మేలు చేసి రుణం తీర్చుకోవాల‌న్న స‌దుద్దేశ్యంతో 2004 లో రాజ‌కీయ తెరంగేట్రం చేసారు.

2004 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా తెనాలి శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించారు. తెనాలి అత్యంత సుంద‌ర‌మైన న‌గ‌రం. కృష్ణా న‌ది నుంచి వ‌చ్చిన మూడు కాలువ‌లు ప్ర‌వ‌హిస్తున్నందు వ‌ల‌న న‌గ‌రానికి తెనాలి అనే పేరు వ‌చ్చింది. ప్యారీస్ న‌గ‌రంలో మెయిన్ రోడ్డుకి ఇరువైపుల రెండు పొడ‌వైన కాలువ‌లు ప్ర‌వ‌హిస్తున్న‌ట్లు తెనాలి న‌గ‌రంలో కూడా ఉండ‌డం మూలాన ఈ న‌గ‌రాన్ని ఆంధ్రా ప్యారీస్ అని కూడా పిలుస్తుంటారు.

అలాంటి న‌గ‌రాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో ప‌రుగులు పెట్టించాల‌ని రాజ‌కీయ, ఆర్ధిక‌, సామాజిక రంగంలో త‌న‌దైన ముద్ర వేయాలని కాంక్షించి శాస‌న స‌భ్యునిగా ఎన్నికైన త‌క్ష‌ణ‌మే శ‌ర‌వేగంగా ఎన్నో కార్య‌క్ర‌మాలకు శ్రీకారం చుట్టారు ముందుచూపుతో నాదెండ్ల మ‌నోహ‌ర్. నియోజ‌క‌వ‌ర్గంలోని మిగ‌తా ప్రాంతాల‌ను అనుసంధానం చేస్తూ…రోడ్లు, ప‌లు వంతెన‌ల నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రిగింది. నంది వెలుగులు మూడు వంతెన‌ల‌ బ్రిడ్జి తెనాలి చుట్టు ప‌క్క‌లను అనుసంధానం చేస్తూ ప‌ట్ట‌ణ రూపురేఖ‌ల‌ను మార్చేసింది.

పెద‌రావురు, నందిరావురును క‌లుపుతూ వేసిన ర‌హ‌దారుల‌తో పాటు 100ల కోట్ల వ్య‌యంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి వాడ‌లో సీసీ రోడ్లు వేయించారు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా బుర‌ద రోడ్ల‌తో ఇబ్బందులు ప‌డుతూ నాణ్య‌మైన ర‌హ‌దారుల కోసం నిరీక్షించిన ఆటోన‌గ‌ర్ వాసుల క‌ల‌ల‌ను సాకారం యుద్ద ప్రాతిప‌దిక‌న రోడ్లు నిర్మాణం చేప‌ట్టి అత్యంత వేగంగా ప‌నులు పూర్తి చేసి ప్ర‌జ‌ల సంక్షేమానికి బాట‌లు వేసారు. ఈ నాణ్య‌మైన ర‌వాణ వ్య‌వ‌స్థ తెనాలి న‌గ‌రాన్ని పారిశ్రామిక రంగంలో ప‌రుగులు పెట్టించేందుకు ఎంత‌గానో దోహ‌ద‌పడింది.

వేలాది మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించారు. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా అందుబాటులో ఉండేలా కూర‌గాయ‌ల మార్కెట్ నిర్మాణం, తెనాలి రామ‌కృష్ణ క‌వి క‌ళాక్షేత్ర‌మ్, నిరంత‌రం విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం విద్యుత్ స‌బ్ స్టేష‌న్ నిర్మాణం వంటివి ఎన్నో బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే పూర్తి చేసిన ఘ‌న‌త నాదెండ్ల మ‌నోహ‌ర్ దే. రాబోతున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి తెనాలి శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుండి జ‌న‌సేన పార్టీ త‌రుపున‌ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. అందుచేత..బ‌ల‌మైన నాయ‌కుడు మ‌నోహ‌ర్ ని అత్య‌ధిక మెజార్టీతో గెలిపిద్దాం..రేప‌టి త‌రం బంగారు భ‌విత‌కు జ‌న‌సేన‌తో బాట‌లు ప‌రుద్దాం..! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here