Home Political News అందుకే..రామ‌జోగ‌య్య శాస్త్రికి మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్.

అందుకే..రామ‌జోగ‌య్య శాస్త్రికి మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్.

97
0

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ పై జ‌న‌సేన పార్టీ నిర్వ‌హించే క‌వాతు కోసం రూపొందించిన ప్ర‌త్యేక గీతాన్ని జ‌న‌సేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  విడుద‌ల చేశారు. విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ పాట‌ని ఆవిష్క‌రించారు.  ”ప‌దా.. ప‌ద‌..ప‌ద.. ప‌ద” అంటూ సాగే చ‌ర‌ణంతో సాగే ఈ పాట‌ని సినీ గీత రచయిత శ్రీ రామ‌జోగయ్య శాస్త్రి ర‌చించారు. సంగీత దర్శకులు శ్రీ ఎస్‌.ఎస్.థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.ఈ పాట జ‌న‌సైనికుల‌తో పాటు సామాన్యుల‌ను కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…ప్రియ‌మైన రామ‌జోగ‌య్య గారికి…విప‌రీత‌మైన ప‌ని ఒత్తిడిలో ఉండి కూడా నా కోరిక‌ను మ‌న్నించినందుకు మీకు నా కృత‌జ్ఞత‌లు. మీరు మీ విలువైన స‌మ‌యాన్ని జ‌న‌సేన క‌వాతు పాట‌కి, యువ‌త‌ని ఆలోచింప చేసే ప‌దాలు, భావిత‌రాల భ‌విష్య‌త్తు కోసం పిరికిత‌నం వ‌ద‌లి మ‌నం మ‌నోధైర్యంతో న‌డుం బిగించి ముందుకు న‌డ‌వాల‌ని అన్న మీ మీ ఆలోచ‌న స్పూర్తి చాలా ప్ర‌స్పుటంగా పాట ర‌చ‌న‌లో క‌నిపించింది. మీకు మ‌న‌స్పూర్తిగా జ‌న‌సేన క‌వాతు త‌రుపున హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌చేసుకుంటున్నాను అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here