Home Actor అందుచేత‌… సైరా చిత్రాన్ని అప్పుడు రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం – చ‌ర‌ణ్.!

అందుచేత‌… సైరా చిత్రాన్ని అప్పుడు రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం – చ‌ర‌ణ్.!

108
0

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి. ఆంగ్లేయులను ఎదిరించిన మొట్ట మొదటి తెలుగు నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమా రూపొందుతోంది. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్‌ రెడ్డి దర్శక‌త్వంలో ఈ సినిమ రూపొందుతోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

చిరు సరసన నయనతార నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, తమన్నా, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి రామ్ చ‌ర‌ణ్ ఓ అప్ డేట్ ఇచ్చాడు. అది ఏంటంటే…విన‌య విధేయ రామ ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. సైరా చిత్రం రెండు నెల‌ల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. గ్రాఫిక్ వ‌ర్క్ ఎక్కువ ఉండ‌డం వ‌ల‌న పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కి ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. అందుచేత సైరా చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here