Home News అందేకే…ప్ర‌జ‌లంద‌రూ జ‌న‌సేనకు అండ‌గా ఉన్నారు – ఆదోని అసెంబ్లీ జ‌న‌సేన అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప‌

అందేకే…ప్ర‌జ‌లంద‌రూ జ‌న‌సేనకు అండ‌గా ఉన్నారు – ఆదోని అసెంబ్లీ జ‌న‌సేన అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప‌

63
0


క‌ర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున పోటీ చేస్తోన్న మ‌ల్ల‌ప్ప త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ప‌దేళ్లుగా ఆదోని నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉంద‌ని..కుటుంబాల పాల‌న‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుకుంటున్నారు. ఒక్క‌సారి త‌న‌కు అవ‌కాశం ఇస్తే…ఆదోనిని అభివృద్ది చేస్తానంటున్నారు మ‌ల్ల‌ప్ప‌. ప్ర‌చారంలో భాగంగా మ‌ల్లప్ప మాట్లాడుతూ…ఇప్పుడున్న రాజ‌కీయాలు చూసిన‌ట్టైతే ఆంధ్ర రాష్ట్రంలో అబ‌ద్ధ‌పు హామీల‌తో చంద్ర‌బాబు నాయుడు గారు కాల‌క్షేపం చేసారు. ప్ర‌తిప‌క్ష పాత్ర స‌మ‌ర్ధ‌వంతంగా పోషించాల్సిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను కొన్నార‌ని బాధ‌తో పాద‌యాత్ర చేసారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌లు వీరిద్ద‌రి నాయ‌క‌త్వంతో విసిగిపోయి నీతి, నిజాయితీ, నిబ‌ద్ధ‌తో కూడుకున్న‌టువంటి నాయ‌క‌త్వం కోసం ఎదురు చూస్తున్న త‌రుణంలో జ‌న‌సేన పార్టీ, సీపీఐ, సీపీఎం కూట‌మి ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డంతో ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు…ఆశీర్వ‌దిస్తున్నారు.

ఎందుకంటే…సెకండ్ బాంబేగా పేరు గాంచిన ఆదోని ఈరోజు 25 ఏళ్లు వెన‌క‌బాటుత‌నానికి గుర‌వుతోంది. దానికి కార‌ణం గ‌తంలో గెలిచిన కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ నాయ‌కులు. వారు స్వ‌లాభాల కోసం రాజ‌కీయాలు చేస్తున్నారు త‌ప్పితే…ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చ‌డం కోసం రాజ‌కీయాలు చేయ‌డం లేదు. అందుకే ఈ ఆదోని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వాళ్ల యొక్క నాయ‌క‌త్వంతో విసుగెత్తి పోయారు కాబ‌ట్టి దానికి ప్ర‌త్యామ్నాయంగా వ‌చ్చిన‌టువంటి జ‌న‌సేన పార్టీనే స‌రైన పార్టీ అని చెప్పి ఆద‌రించి ఆశీర్వ‌దిస్తున్నారు.

చంద్ర‌బాబు నాయుడు గారి పాల‌న చూసాం కానీ..అది 5 ఏళ్ల పాల‌న కాదు. కేవ‌లం 5 నెల‌ల పాల‌న‌గా మారింది. క‌రెక్ట్ గా  ఎల‌క్ష‌న్ టైమ్ వ‌చ్చేస‌రికి అంద‌రినీ మ‌భ్య‌పెట్టే విధంగా ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నారు. అలాగే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి మ్యానిఫెస్టో ఒక‌సారి చూసిన‌ట్లైతే..న‌వ‌ర‌త్నాలు పేరుతో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడ‌తా అంటున్నారు.  రాష్ట్రం ఆర్ధిక ప‌రిస్థితి స‌రిగా లేదు.  2 ల‌క్ష‌ల కోట్లు బ‌డ్జెట్ ఉంటే…4 ల‌క్ష‌ల కోట్ల ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నారు. అబ‌ద్ధ‌పు హామీల‌తో ఎవ‌రు వ‌చ్చినా ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేరు.

 కాబ‌ట్టి స‌రైన స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు నెర‌వేర్చే హామీలే ప్ర‌క‌టించారు త‌ప్పితే…అబ‌ద్ధ‌పు హామీలు ఇవ్వ‌లేదు. రేష‌న్ కి బ‌దులు క్యాష్ ఇస్తామ‌ని మా నాయ‌కుడు చెప్పారు. నిజంగా గొప్ప ప‌థ‌కం అది. ఉచిత గ్యాస్, కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య‌, ఉచిత వైద్యం, అలాగే  రైతుల‌కు 5 వేల పెన్ష‌న్స్, విక‌లాంగుల‌కు పెన్ష‌న్, ఇలా… ప్ర‌తి వ‌ర్గానికి న్యాయం చేసే మ్యానిఫెస్టోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ప్ర‌క‌టించారు. అందుచేత ప్ర‌జ‌లంద‌రూ జ‌న‌సేన వైపే ఉన్నారు. త‌ప్ప‌కుండా జ‌న‌సేన విజ‌యం సాధిస్తుంద‌నే ధీమాని ఆదోని జ‌న‌సేన అభ్య‌ర్థి మ‌ల్ల‌ప్ప‌ వ్య‌క్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here