Home Actor అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే క‌థ మిస్ట‌ర్ కెకె – విక్ర‌మ్

అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే క‌థ మిస్ట‌ర్ కెకె – విక్ర‌మ్

50
0
అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే క‌థ మిస్ట‌ర్ కెకె - విక్ర‌మ్ spiceandhra

చియాన్‌ విక్రమ్‌ హీరోగా అక్షరహసన్‌, అభిహసన్‌ కీలక పాత్రల్లో రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వంలో తమిళంలో రూపోందిన చిత్రం ‘కదరమ్‌ కొండన్‌’.  రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌ పై రూపొందిన‌ ఈ చిత్రాన్ని  టి. అంజయ్య సమర్పణలో ఉత్తమాభిరుచి గల నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెషన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు టి.నరేష్‌ కుమార్‌, టి. శ్రీధర్‌లు సంయుక్తంగా ‘మిస్టర్‌ కెకె’ టైటిల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ సినిమాని జులై 19న గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా హీరో విక్ర‌మ్ మీడియాతో మాట్లాడుతూ… ఇంటర్నేషనల్‌ స్టైల్లో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్‌ కెకె’. నా సినిమా కెరీర్‌లో వన్‌ఆఫ్‌ది బెస్ట్‌ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. అది పాజిటివా? నెగటివా? అని ముందే పసిగట్టడం ప్రేక్షకుడికి వీలుకాదు. గ్రేషేడ్స్‌ ఉండే పాత్ర. సినిమా చూసేట‌ప్పుడు ఆ విషయం ప్రేక్ష‌కుల‌కు అర్థమవుతుంది.

నా దృష్టిలో ఏ సినిమాకైనా కథే ముఖ్యం. కానీ అన్ని సమయాల్లో అది కుదరకపోవచ్చు. మంచి కథ ఉన్నప్పుడు గొప్ప క్యారెక్టర్‌ ఉండకపోచ్చు. కొన్ని సినిమాలకు క్యారెక్టర్‌ పేరే సినిమా టైటిల్‌గా ఉంటుంది. అంటే పాత్ర అంత బాగా ఉంటుందనే అర్ధం.ఈ సినిమాలో కూడా క్యారెక్ట‌ర్ చాలా డిఫ‌రెంట్ గా, స్ట్రాంగ్ గా ఉంటుంది కనుక‌నే క్యారెక్ట‌ర్ పేరుతో టైటిల్ పెట్టాం.

నార్మల్‌గా డైలాగ్స్‌ వల్లే మనం పెర్‌ఫార్మన్స్‌ చేయగలుగుతాం. అలాంటి డైలాగ్స్‌ లేకుండా నేను నటించానంటే.. ఏదో ఒక పార్ట్‌ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ చేస్తుందనే నమ్ముతాను. ఉదాహరణకు నేను శివపుత్రుడు సినిమా చేశాను. దాన్ని ఎవరూ రీమేక్‌ చేయలేదు. అంతకు ముందు ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. ‘శివపుత్రుడు’ని రీమేక్‌ చేయకపోవడానికి కారణం.. ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాదేమోనని అనుకున్నారు కానీ.. అది బాగా కనెక్ట్‌ అయ్యింది.

నేటివిటీ కారణంగానే ఆడియెన్‌ సినిమాకు కనెక్ట్‌ కాడు. ఎమోషన్‌ మాత్రమే కనెక్ట్‌ అవుతుంది. ఉదాహరణకు గేమ్‌ ఆఫ్‌ థ్రోన్‌ సినిమా నేటివిటీ మనది కాదు. కానీ ప్రేక్షకులు సినిమాను చూశారు. అలాగే బాహుబలి సినిమా అందరికీ కనెక్ట్‌ అయ్యింది. ఈవిధంగా మిస్ట‌ర్ కెకె  ప్రేక్షకులు అంద‌రికీ కనెక్ట్‌ అయ్యే మంచి కథ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here