Home Actor అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే మంచి సినిమా ఓ..బేబీ – ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి

అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే మంచి సినిమా ఓ..బేబీ – ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి

59
0
అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే మంచి సినిమా ఓ..బేబీ - ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి spiceandhra

అలా..మొద‌లైంది, జ‌బ‌ర్థ‌స్త్, క‌ళ్యాణ వైభోగ‌మే..ఇలా వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను అందించిన నందినీ రెడ్డి తెర‌కెక్కించిన తాజా చిత్రం ఓ..బేబి. స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఓ..బేబీ కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్. ఈ చిత్రంలోని పాట‌ల‌కు విశేష స్పంద‌న ల‌భించింది. అలాగే ట్రైల‌ర్ కూడా చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి. జులై 5న ఈ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి చిత్ర విశేషాల‌ను తెలియ‌చేస్తూ… మేం బాగా క‌నెక్ట్ అయిన క‌థ ఇది. ఒక మంచి సినిమాని అందించాల‌ని ఈ సినిమాని తీసాం. మ‌నంద‌రి లైఫ్ లో మ‌ద‌ర్ ఎమోష‌న్ అనేది చాలా కీల‌క‌మైంది. ఈ ఎమోష‌న్ ఈ సినిమాలో హైలైట్ గా ఉంటుంది. థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కూడా ఈ సినిమా గురించి ఆలోచిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే..కొన్ని రోజులు పాటు గుర్తుంటుంది ఈ సినిమా.

ఈ సినిమాని రీమేక్ చేయాల‌ని స‌మంతే ఫ‌స్ట్ నా ద‌గ్గ‌రికి ఈ సినిమాని తీసుకువ‌చ్చింది. ఇది కొరియ‌న్ లో వ‌చ్చినప్ప‌టికీ మనంద‌రికీ క‌నెక్ట్ అయ్యే స్టోరీ. అందుక‌నే రీమేక్ చేసాం. ఖ‌చ్చితంగా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక స‌మంత గురించి చెప్పాలంటే…త‌ను త‌ప్ప ఈ పాత్ర‌ను ఇంకెవ‌రు అంత గొప్ప‌గా చేయ‌లేరు. న‌టించ‌డ‌మే కాకుండా..స్క్రిప్ట్ లో కూడా మంచి స‌ల‌హాలు ఇచ్చింది.

ఇక సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మీ గారి గురించి చెప్పాలంటే…ఆవిడ ఈ సినిమాలో న‌టించ‌ను అంటే..ఈ సినిమా చేసి ఉండేవాళ్లం కాదేమో. ఆమె పాత్ర‌లో అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఉంటాయి. వాటిని పండించాలంటే ఖ‌చ్చితంగా ఆ పాత్ర‌ను గొప్ప న‌టి న‌టించాలి. ల‌క్ష్మీ గారు త‌ప్ప మాకు ఇంకెవ‌రు క‌నిపించ‌లేదు. నిజంగా..చాలా అద్భుతంగా న‌టించారు. అలాగే రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు, రావు ర‌మేష్ గారు, తేజ‌…ఇలా ఈ సినిమాలో న‌టించిన వారంద‌రూ చాలా చ‌క్క‌గా న‌టించారు. ఖ‌చ్చితంగా ఓ..బేబీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది అని మా గ‌ట్టి న‌మ్మ‌కం అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here