Home News అంద‌రికీ మేలు జ‌రిగేట‌ట్టు ప‌ని చేసే పార్టీ జ‌న‌సేన పార్టీ – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్ధి...

అంద‌రికీ మేలు జ‌రిగేట‌ట్టు ప‌ని చేసే పార్టీ జ‌న‌సేన పార్టీ – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్ధి నాదెండ్ల మ‌నోహ‌ర్

109
0


మ‌హిళా సంక్షేమం, యువ‌త‌కు ఉపాధి, భ‌విష్య‌త్ త‌రాల కోసం ప‌ర్యావ‌ర‌ణం పై దృష్టి పెట్ట‌డం..ఇలా ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించాల‌నే స‌దుద్ధేశ్యంతో జ‌న‌సేన పార్టీ ఉంద‌ని తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్ధి నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. ఆయ‌న ఓట‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ…అంద‌రికీ మేలు చేసేట‌ట్టు సుపరిపాల‌న చేసేట‌ట్టు ప్లాన్ చేస్తున్నామ‌న్నారు. ప్ర‌జ‌లు ఈ ఐదు సంవ‌త్స‌రాలు న‌ర‌కం అనుభ‌వించారు. అటువంటి దానికి స్వ‌స్తి ప‌ల‌కండి. ఖ‌చ్చితంగా జ‌న‌సేన పార్టీ ప్ర‌జ‌ల కోసం అండ‌గా నిలబ‌డుతుంది. మా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంద‌రూ కూడా ప్ర‌జా సేవ చేద్దామ‌నే మాట మీద ఉన్నారని తెలియ‌చేసారు.

గ‌తంలో నేను శాస‌నస‌భ్యుడిగా ఉన్న‌ప్పుడు రాష్ట్ర కేబినెట్ నుంచి కూడా నిధులు తీసుకువ‌చ్చాను. అయినా కూడా ఉప‌యోగించుకోలేక‌పోయారు. నాలుగున్న‌రేళ్ల‌లో చాలా అభివృద్ధి చేయాలి కానీ…ప్ర‌భుత్వం ఏం చేయ‌లేదు. అనేక సంక్షేమ ప‌ధ‌కాలు కూడా స‌రైన రీతిలో ప్ర‌జ‌ల‌కు అంద‌డం లేదు. అవ‌కాశాలు ఉన్నాయి..స్పందించే వారు లేరు. మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం తెలుగుదేశం ప్ర‌భుత్వం. అంద‌ర్నీ స‌మానంగా చూసుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌భుత్వం అంటే సొంతంగా భావించాలని… కొంత మంది రాజ‌కీయ నాయ‌కుల‌కు కాదని. జ‌న‌సేన పార్టీ ధ‌ర్మాన్ని, న్యాయాన్ని కాపాడే పార్టీ. అంద‌రికీ మేలు జ‌రిగేట‌ట్టు ప‌ని చేస్తుంది అని నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here