Home News Movie News అక్కినేని నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!

అక్కినేని నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!

8
0

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది..  నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లెంగ్తీ షెడ్యూల్ లో నాగ చైతన్య, సమంత పాల్గొంటుండగా, వీరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం. ‘నిన్నుకోరి ‘ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమా కి  దర్శకత్వం వహిస్తున్నారు.

దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజులు ఇతర ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.. షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది  ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు..  పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో  ఈ  చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

నాగ చైతన్య, సమంతా, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ మరియు రాజశ్రీ నాయర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం: శివ నిర్వాణ, నిర్మాతలు: సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది, బ్యానర్: షైన్ స్క్రీన్స్ బ్యానర్, సంగీతం: గోపీ సుందర్, డిఓపి : విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్: సాహీ సురేష్, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, యాక్షన్: వెంకట్, PRO: వంశీ శేఖర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here