Home Actor అఖిల్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?

అఖిల్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?

81
0

అక్కినేని అఖిల్ న‌టించిన లేటెస్ట్ మూవీ మిస్ట‌ర్ మ‌జ్ను. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజైంది. అఖిల్ ఫ‌స్ట్ & సెకండ్ మూవీ ఫ్లాప్ అవ్వ‌డంతో థ‌ర్డ్ మూవీ మిస్ట‌ర్ మ‌జ్ను పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు కానీ…ఈ సినిమా కూడా ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేదు. దీంతో మిస్ట‌ర్ మ‌జ్ను అటు  అభిమానుల‌కు, ఇటు అఖిల్ కు నిరాశే మిగిల్చింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా అఖిల్ మీడియాతో మాట్లాడుతూ… త‌దుప‌రి చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో ఎనౌన్స్ చేస్తాను. ద‌స‌రాకి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

అయితే..ఎవ‌రితో ఉంటుంది అనేది మాత్రం చెప్ప‌లేదు. ఇదిలా ఉంటే…అఖిల్ నెక్ట్స్ మూవీ ఆది పినిశెట్టి సోద‌రుడు స‌త్య‌ ప్ర‌భాస్ పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా శ్రీను వైట్ల కూడా అఖిల్ కోసం క‌థ రెడీ చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవ‌రో ఒక‌రితో అఖిల్ నెక్ట్స్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి…ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా ప్ర‌భాస్ పినిశెట్టి, శ్రీను వైట్ల వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రితో త‌దుప‌రి చిత్రం చేస్తాడా..?   లేక వీరిద్ద‌రూ కాకుండా వేరే డైరెక్ట‌ర్ తో చేస్తాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here