Home Actor అఖిల్ మూవీకి ముహ‌ర్తం ఖ‌రారు..?

అఖిల్ మూవీకి ముహ‌ర్తం ఖ‌రారు..?

112
0

అక్కినేని అఖిల్ మ‌నం చిత్రంలో అతిథిగా అల‌రించినా.. క‌థానాయ‌కుడిగా మాత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను.. ఇలా అఖిల్ హీరోగా న‌టించిన మూడు చిత్రాలు నిరాశ‌ప‌రిచాయి. దీంతో అఖిల్ నాలుగ‌వ సినిమా పై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా స‌రే..స‌క్స‌స్ సాధించాల‌ని అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

నాగ చైత‌న్య‌కి బ్లాక్‌బ‌స్ట‌ర్ 100% ల‌వ్ చిత్రాన్ని అందించిన అల్లు అర‌వింద్ అనుబంధ సంస్థ‌లో అఖిల్ నాలుగ‌వ‌ ఈ చిత్రం చేస్తున్నాడు. బ‌న్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.  గోపీ సుంద‌ర్ సంగీత‌మందించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి క‌థానాయిక ఎంపిక ఇంకా పూర్త‌వ‌లేద‌ని తెలిసింది.  ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని మే 24న లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం.  జూన్ నెలాఖ‌రు లేదా జూలై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. ఈ ఇయ‌ర్ ఎండింగ్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. అఖిల్ ఈసారైనా ఆశించిన విజ‌యాన్ని అందిస్తాడో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here