Home Movie News అఖిల్ మూవీ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేస్తోంది..!

అఖిల్ మూవీ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేస్తోంది..!

96
0
Akhil 3rd movie title

అక్కినేని అఖిల్ న‌టించిన ఫ‌స్ట్ మూవీ అఖిల్ ఫ్లాప్ అయ్యింది.  సెకండ్ మూవీ హ‌లో సినిమాతో స‌క్స‌స్ సాధిస్తాడ‌నుకుంటే…ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది కానీ..బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించ‌లేక‌పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో మూడ‌వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ మూవీకి మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ నెల 29న ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలిసింది. ఇంతవరకు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌పోయినా.. అఖిల్ 3 టీజర్‌తో నాగ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. టైటిల్‌, అఖిల్‌ లుక్‌తో పాటు సాంగ్‌ టీజర్‌ను కూడా విడుదల చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here