Home Actor అఖిల్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్ చేయ‌నున్నాడా..?

అఖిల్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్ చేయ‌నున్నాడా..?

114
0

అక్కినేని అఖిల్ న‌టించిన మూడు సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో నాలుగువ సినిమా పై అఖిల్, అభిమానులు  చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ సినిమా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర‌వింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ మూవీ వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించ‌నుందని…మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ని ఫైనల్ చేసార‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే…స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయ‌నున్నార‌ని. త్వ‌ర‌లోనే ఈ మూవీని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. అఖిల్ మూవీలో బ‌న్నీ గెస్ట్ రోల్ చేయ‌డం నిజ‌మైతే…ఈ ప్రాజెక్ట్ కి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here