Home Actor అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

87
0
అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..? spiceandhra

అక్కినేని అఖిల్ న‌టించ‌నున్న నాలుగ‌వ సినిమా ఇటీవ‌ల ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే నెల‌లో ఈ సినిమాని ప్రారంభించారు కానీ… ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్లలేదు.

జూన్ 26 నుంచి సెట్స్ పైకి వెళుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ…ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ స్టార్ట్ కాలేదు. కార‌ణం ఏంటంటే…న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ సెట్ అయ్యారట కానీ..హీరోయిన్ ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా క‌న్ ఫ‌ర్మ్ కాలేద‌ట‌. అందుక‌నే ఆల‌స్యం అవుతుంద‌ని స‌మాచారం. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…ప్ర‌స్తుతం హీరోయిన్ ఎవ‌రు అనేది ఖ‌రారు చేసే ప‌నిలో ఉన్నార‌ట చిత్ర యూనిట్.

కైరా అద్వానీ, ర‌ష్మిక పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ…కొత్త అమ్మాయిని తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే హీరోయిన్ ని ఎంపిక చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నార‌ట. ఈ నెల 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసారని తెలిసింది. ఈ సినిమా పై అఖిల్ తో పాటు అభిమానులు కూడా చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఆశించిన విజ‌యాన్ని అందిస్తాడని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here