Home Actor అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

61
0

అక్కినేని అఖిల్ న‌టించిన మూడు సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో నాలుగ‌వ సినిమా పై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అందుక‌నే ఈ సినిమా క‌థ విష‌యంలో చాలా కేర్ తీసుకున్నాడు. చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  బ‌న్నీవాసు,వాసు వ‌ర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మే నెలలో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఈ సినిమా ప్రారంభ‌మైంది. అయితే…ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…ఈ నెల 26 నుంచి షూటింగ్ ప్రారంభించ‌నున్నారని స‌మాచారం. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం హైదరాబాద్‌లో జరగ‌నుంది. కొంత పోర్షన్‌ను రెండు దేశాల్లో చిత్రీకరించాలను కుంటున్నారు. అవేంటో ఇంకా ఫిక్స్‌ చేయలేదు. అలాగే.. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో అఖిల్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు.

త్వ‌ర‌లోనే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఖ‌రారు చేయ‌నున్నారు. దీనికి గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో  రూపొందే ఈ చిత్రాన్ని ఈ సంవ‌త్స‌రంలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here