Home Actor అఖిల్ స‌ర‌స‌న నాని హీరోయిన్..?

అఖిల్ స‌ర‌స‌న నాని హీరోయిన్..?

114
0
అఖిల్ స‌ర‌స‌న నాని హీరోయిన్..? spiceandhra

అక్కినేని అఖిల్ – బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు – వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో షూటింగ్ ప్రారంభించారు. అయితే.. హీరోయిన్ ఎవ‌రు అనేది ఫైన‌ల్ కాలేదు అయిన‌ప్ప‌టికీ షూటింగ్ స్టార్ట్ చేసారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…  అఖిల్ జోడీగా ఒక అమ్మాయిని ఎంపిక చేశారని తెలిసింది. ఇంత‌కీ ఆ అమ్మాయి ఎవ‌ర‌నుకుంటున్నారా..?  ఆల్రెడీ నాని సినిమా గ్యాంగ్ లీడర్ లో న‌టిస్తోన్న‌ప్రియాంకా అరుళ్ మోహన్. ఆకర్షణీయమైన రూపంతో తమిళ, కన్నడ ప్రేక్షకుల హృదయాలను ఈ సుందరి కొల్లగొడుతోంది. త్వ‌ర‌లో గ్యాంగ్ లీడ‌ర్ తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల తరువాత ఈ అమ్మ‌డు బాగా బిజీ కావడం ఖాయం అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. అందుక‌నే అఖిల్ జోడీగా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here