Home Political News అచ్చంపేట‌లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం – టీఆర్ఎస్ అభ్య‌ర్ధి గువ్వ‌ల బాల‌రాజు

అచ్చంపేట‌లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం – టీఆర్ఎస్ అభ్య‌ర్ధి గువ్వ‌ల బాల‌రాజు

92
0

పదరమండలంలోని మద్దిమడుగు, ఉడిమిళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు.  ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో పాటు పార్టీ మేనిఫెస్టోను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ఎన్నిక‌ల్లో కారు గుర్తుకు ఓటు వేసి త‌న‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా గువ్వ‌ల బాల‌రాజు మాట్లాడుతూ… ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అసాధారణ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలు అమలయ్యాయి. పట్టణంలో రూ.23 కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మాణం కొనసాగుతున్నది. రూ.103 కోట్లతో 512 చెరువుల పునరుద్ధరణతోపాటు రూ.7 కోట్లతో 50 పడకల మాతా శిశు సంరక్షణ దవాఖాన మంజూరైంది అని చెప్పారు.

15 కోట్లతో ఐదు మార్కెట్ గిడ్డంగుల నిర్మాణం, రైతుబజార్ మంజూరుకు జీవో విడుదల కావడం, ఎంజీకేఎల్‌ఐ ద్వారా 45 చెరువులను నింపి 30 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు ఇవ్వడం వంటి పనులు పూర్తయ్యాయి. ఇక్కడ కొత్తగా 5 గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాల మంజూరు, రెవిన్యూ డివిజన్, రెండు కొత్త మండలాలు, 75 కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు ఈ నాలుగేండ్లలోనే జరిగాయి. అందుచేత అచ్చంపేట పై మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని గువ్వ‌ల బాల‌రాజు చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి టీఆర్‌ఎస్‌కు మరింత బలమైన క్యాడర్ ఉన్నదని… ఇక్కడ అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రతీ ఇంటికీ చేరాయ‌ని… అందుచేత ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తాన‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here