Home Uncategorized అడివి శేష్‌ గూఢ‌చారి సెన్సార్ పూర్తి.!

అడివి శేష్‌ గూఢ‌చారి సెన్సార్ పూర్తి.!

146
0
Goodachari release

అడివి శేష్ న‌టించిన స్పై థ్రిల్లర్ గూఢ‌చారి. యంగ్ డైరెక్ట‌ర్ శ‌శి కిర‌ణ్ తిక్క తెర‌కెక్కించిన గూఢ‌చారి చిత్రంలో అడివి శేష్ స‌ర‌స‌న శోభిత ధూళిపాళ న‌టించింది. ఈ చిత్రం ద్వారా యార్ల‌గ‌డ్డ సుప్రియ రీ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం.  ఈ చిత్రంలో సుప్రియా యార్లగడ్డ నదియా ఖురేషీ పాత్రను పోషించారు. ఇటీవ‌ల నాని రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. దీంతో ఈ సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఇక ఈ సినిమాని ఆగ‌ష్టు 3న భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. ఈరోజు సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డ్ ఈ సినిమాని చూసి ఎలాంటి క‌ట్స్ లేకుండా యు/ఎ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం విశేషం. ట్రైల‌ర్ చూస్తుంటేనే హాలీవుడ్ మూవీలా అనిపిస్తుండ‌డం..దీనికి తోడు డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న్స్ తో యూత్ ని బాగా ఆక‌ట్టుకోవ‌డంతో ఈ మూవీ పై  భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 116 రోజుల్లో.. 168 డిఫరెంట్‌ లోకేషన్లలో హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారంటే ఈ చిత్ర క‌థ పై ఎంత న‌మ్మ‌కం ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ప్రేక్ష‌కుల‌కు ఈ  స్పై థ్రిల్లర్ కొత్త అనుభూతి క‌లిగిస్తుంద‌ని చిత్ర యూనిట్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మ‌రి..ఆ న‌మ్మం నిజం అవుతుంద‌ని ఆశిద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here