Home Actor అడివి శేష్ ఎవ‌రు ప్రీ లుక్ రిలీజ్

అడివి శేష్ ఎవ‌రు ప్రీ లుక్ రిలీజ్

67
0
అడివి శేష్ ఎవ‌రు ప్రీ లుక్ రిలీజ్ SPICEANDHRA

క‌ర్మ‌, కిస్, క్ష‌ణం, గూఢ‌చారి.. ఇలా ఓ వైపు విభిన్న క‌థా చిత్రాల్లో న‌టిస్తూ…మ‌రో వైపు క‌థ‌లు అందిస్తూ..అనుక్ష‌ణం సినిమా గురించి ఆలోచించే న‌టుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు అడివి శేష్‌. క్ష‌ణం, గూఢ‌చారి చిత్రాల‌తో పెద్ద విజ‌యాల్ని సొంత చేసుకున్న అడివి శేష్ తాజా చిత్రం ఎవ‌రు. ఈ చిత్రానికి రాంజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ నెల 11వ తేదీన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికగా రెజీనా నటిస్తోంది. ప్రీ లుక్ లో అడివి శేష్ విక్ర‌మ్ వాసుదేవ్ పాత్ర‌లో పోలీస్ గా క‌నిపించారు. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటాడు కాబ‌ట్టి అడివి శేష్ ఎవ‌రు  సినిమా పై ఖ‌చ్చితంగా బాగుంటుంది అనే పాజ‌టివ్ టాక్ ఉంది. మ‌రి..ఎవ‌రు సినిమాతో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here