Home Actor అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం – పవన్ కళ్యాణ్‌

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం – పవన్ కళ్యాణ్‌

66
0


లోక్‌స‌భ అభ్య‌ర్ధి అంటే రూ. 100 కోట్లు- రూ. 70 కోట్ల పెట్టుబ‌డి వ్యాపారం అయిపోయింద‌నీ, జ‌న‌సేన పార్టీ పెట్టుబ‌డి లేని రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని నిర్మిస్తుంద‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ అభ్య‌ర్ధుల‌కి, జ‌న‌సేన అభ్య‌ర్ధుల‌కి మ‌ధ్య తేడా గ‌మ‌నించాల‌ని ప్ర‌జ‌ల్ని కోరారు. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధులుగా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసే నాయ‌కుల‌ను నిల‌బెట్టిన‌ట్టు తెలిపారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరు రైల్వే స్టేష‌న్ వ‌ద్ద జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. స‌భ‌కి హాజ‌రైన జ‌న‌వాహినికి జ‌న‌సేన పార్టీ త‌రఫున బ‌రిలోకి దిగుతున్న అభ్య‌ర్ధుల‌ని ప‌రిచ‌యం చేశారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ఏలూరు పార్ల‌మెంట‌రీ స్థానానికి పోటీ చేస్తున్న డాక్ట‌ర్ పెంట‌పాటి పుల్లారావు చ‌ట్టం తెలిసిన వారు. ఆర్ధిక వేత్త‌. పోల‌వ‌రం, కొల్లేరు స‌మ‌స్య‌ల మీద పోరాటం చేస్తున్న నాయ‌కుడు. ఓట్లు వేయించుకుని పార్ల‌మెంటు హాల్లో మొద్దు నిద్ర‌పోయే ఎంపి మాగంటి బాబు లాంటి వారు కాదు. చ‌ట్ట స‌భ‌ల్లో సైతం ధైర్యంగా మాట్లాడ‌గ‌ల నాయ‌కుడు, మేధావి. ఇలాంటి నాయ‌కులు చ‌ట్ట‌స‌భ‌ల‌కి వెళ్తే   స‌మ‌స్య‌ల మీద బ‌లంగా ప్ర‌శ్నించ‌గ‌ల‌రు. జ‌న‌సేన పార్టీ ఓ మార్పు దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ రోజు మొద‌లుపెట్టిన ఈ మార్పు పంచాయితీ ఎన్నిక‌ల్లో కూడా అమ‌లు చేద్దాం. పంచాయితీ ఎన్నిక‌ల్లో యువ‌త‌, మ‌హిళ‌ల‌కి ప్రాధాన్య‌త ఇద్దాం. చింత‌మ‌నేని ప్రభాకర్ ని అదుపు చేయ‌డానికి ఒక మ‌హిళ‌ని నిల‌బెడుతున్నా. చింత‌మ‌నేని భార‌త రాజ్యాంగాన్ని అడ్డంగా ధిక్క‌రిస్తుంటే, చంద్ర‌బాబు కూడా కంట్రోల్ చేయ‌డం లేదు.

 నేను కొల్లేరు వెళ్తుంటే రాకూడ‌దు అని హుకుం జారీ చేశారు. నా మీద దాడులకు పాల్ప‌డాల‌ని చూశారు. అలాంటి చింత‌మ‌నేనిని  ఎదుర్కొవ‌డానికి ఘంట‌సాల వెంక‌ట‌ల‌క్ష్మి గారిని నిల‌బెట్టా. ఏలూరు ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి కూడా దెందులూరు ఎమ్మెల్యే దూకుడుని ఆప‌లేక‌పోయారు. అందుకే ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి చింత‌మ‌నేనికి స‌రైన మొగుడు కార్మిక నాయ‌కుడు రెడ్డి అప్ప‌ల‌నాయుడు గారిని బ‌రిలోకి దించాం. ఒక‌ప్పుడు చింత‌మ‌నేనిని ఎదుర్కొంటే ఆయ‌న పై అక్ర‌మంగా కేసులు కూడా పెట్టారు. నాకు రాజ‌కీయ అనుభ‌వం లేద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవి నాకు మూడో ఎన్నిక‌లు ఒక్కొక్క‌రి దుమ్ము దులుపుతాం. తెలుగుదేశం పార్టీ గూండాల‌ను ఎన్నిక‌ల్లో నిల‌బెడితే వాళ్ల తాట తీసే నాయ‌కుల‌ను జ‌న‌సేన నుంచి బ‌రిలోకి దింపుతాం అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here