Home Actor అధికార‌, ప్ర‌తిప‌క్ష‌ పార్టీలు రెండూ అవినీతిలో మునిగిపోయాయి – ప‌వ‌న్ క‌ళ్యాణ్

అధికార‌, ప్ర‌తిప‌క్ష‌ పార్టీలు రెండూ అవినీతిలో మునిగిపోయాయి – ప‌వ‌న్ క‌ళ్యాణ్

74
0


 జ‌న‌సేన ప్ర‌భుత్వం వ‌స్తే ప్ర‌తి మండలానికి  డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. ఇంట‌ర్ చ‌దువుకున్న విద్యార్ధుల‌కు ఉచిత ల్యాప్ టాప్స్ అందిస్తాం. తుంగ‌భ‌ద్ర డ్యామ్ నుంచి ఎల్ ఎల్ సీ కాలువ ద్వారా పూర్తి నీటి వాటా రావ‌డం లేదు.  జ‌న‌సేన పార్టీ వ‌చ్చాక ద‌శాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న న‌దీజ‌లాల‌ పంపిణీ స‌మ‌స్య‌ల‌ను రెండేళ్ల‌లో పరిష్క‌రిస్తాం అని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. ఇందుకోసం ముఖ్య‌మంత్రి చైర్మ‌న్ గా ఉండేలా వాట‌ర్ క‌మిష‌న్ ఏర్పాటు చేస్తాం. పేద‌ల‌కు ఇళ్లు, ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయిస్తాం. ఎస్పీ, ఎస్టీ, మైనార్టీల నుంచి యువ పారిశ్రామికవేత్త‌ల‌ను త‌యారు చేసేందుకు వెంచ‌ర్ క్యాపిట‌ల్ ఫండ్ కింద రూ. 2 వేల కోట్లు కేటాయిస్తాం.

జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటు అయితే హిందూ, ముస్లింల స‌మైక్య‌త‌కు ఆదోని ప‌ట్ట‌ణం నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మారుస్తాం. ఆదోని మ‌సీదును క‌డ‌ప ద‌ర్గా మాదిరి దేశం మొత్తం తెలిసేలా చేస్తాం. దక్షిణ భారత దేశ ఆజ్మీర్ గా పేరుగాంచిన క‌డ‌ప‌ దర్గాతో పాటు రాయ‌ల‌సీమ‌ ప్రాంతంలో ఉన్న అనేక మ‌సీదుల‌ను క‌లుపుతూ ముస్లిం యాత్రికుల కోసం రూ.100 కోట్లు పెట్టుబ‌డితో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. 2011లో జ‌రిగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌లు కార‌ణంగా రెండు మ‌తాల యువ‌కుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. వాటిని జ‌న‌సేన ప్ర‌భుత్వం రాగానే మాన‌వ‌తా దృక్ప‌థంతో తీయించే ప్ర‌య‌త్నం చేస్తాం అన్నారు.

రెండేళ్లు జైలులో ఉన్న జగన్ ను ఏమని పిలవాలి…?

ప్ర‌తిప‌క్ష‌ నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  మాట్లాడితే న‌న్ను చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ అని, యాక్ట‌ర్ అని అంటున్నారు. ఆయ‌న‌కు ఒక‌టే చెబుతున్నాను. నేను యాక్ట‌ర్ ను కాద‌ని ఏనాడు చెప్ప‌లేదు. యాక్టింగ్ వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన న‌న్ను మీరు యాక్ట‌ర్ అని పిలిస్తే .. రెండేళ్లు జైల్లో ఉండి వ‌చ్చిన మిమ్మ‌ల్నినేను ఏమ‌ని పిల‌వాలి..? నేను తెలుగుదేశం పార్ట‌న‌ర్ అయితే.. మీరు టీఆర్ఎస్, బీజేపీ పార్ట‌న‌రా..? . ముఖ్య‌మంత్రుల కొడుకులు క‌దా అని ఇష్టానికి మాట్లాడితే చూస్తూ కూర్చొవ‌డానికి ఎవ‌రూ సిద్దంగా లేరు. ఒక మాట మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఆచితూచి మాట్లాడండి.  ఆదోని ప్రాంతంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష‌ పార్టీలు రెండూ అవినీతిలో మునిగిపోయాయి.  60: 40 ప‌ర్సంటేజ్ లెక్క‌న ప్ర‌జాధ‌నాన్ని పంచుకుంటున్నారు. అవినీతిలేని రాజ‌కీయాలు కావాలంటే జ‌న‌సేన పార్టీకి ఓటు వేసి గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన అభ్య‌ర్ధుల‌ను భారీ మెజార్టీతో గెలిపించమ”ని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here