Home News అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల హామీలను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదు. విజ‌యం మాదే – రాజ‌మండ్రి అర్బ‌న్...

అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల హామీలను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదు. విజ‌యం మాదే – రాజ‌మండ్రి అర్బ‌న్ జ‌న‌సేన అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌

126
0


ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని..రాజ‌మండ్రి అర్బ‌న్ అసెంబ్లీ అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు. స‌మ‌స్య‌ల పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల్సిన ప్ర‌తిప‌క్షం కాల‌యాప‌న చేసింద‌న్నారు. జ‌న‌సేన‌ ఎక్క‌డ‌కు వెళ్లినా అనూహ్య స్పంద‌న వ‌స్తుంద‌ని… ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్త‌శుద్ధిని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని..ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌కు ప‌ట్టం క‌డ‌తార‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేసారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అత్తి స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ…రోజురోజుకు జ‌న‌సేన‌కు ఆద‌ర‌ణ మ‌రింత పెరుగుతుంది. నామినేష‌న్ వేసిన‌ప్పుడు వేలాది మంది జ‌న సైనికులు త‌ర‌లి వ‌చ్చారు.

ఏ వార్డ్ కు వెళ్ళినా ప్ర‌జ‌లు ఎంత‌గానో ఆద‌రిస్తూ..త‌ప్ప‌కుండా ఈసారి ఓటు జ‌న‌సేన‌కే అని చెబుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు సేవ చేయ‌డానికి వ‌చ్చారు. ఆయ‌న సిద్ధాంతాలు చాలా బాగా న‌చ్చాయి. ఖ‌చ్చితంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికే మా ఓటు అని ప్ర‌జ‌లే చెబుతున్నారు. అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షం ఈ రెండింటి పై ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నారు. చంద్ర‌బాబు నాయుడు గారు ఆరు వంద‌ల హామీలు ఇచ్చారు. ఎన్ని హామీలు నెర‌వేర్చారో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మోస‌పూరిత‌మైన హామీలు ఇస్తున్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా న‌మ్మ‌డం లేదు.

ఇక జ‌గ‌న్ గార్కి ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చారు. ప్ర‌తిప‌క్ష నేత అంటే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కోసం పొరాడాలి. అలాంటిది అసెంబ్లీకే వెళ్ల‌లేదు. ఎన్నిక‌ల్లో ఓటు వేసి గెలిపిస్తే..అసెంబ్లీకి వెళ‌తావ‌ని న‌మ్మ‌కం ఏంటి..?  ఆయ‌న‌కి  సీఎం ప‌ద‌వి మీద మోజు ఉంది కానీ…ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి మాత్రం ఇంట్ర‌స్ట్ లేద‌ని తెలుస్తుంది. నీతి నిజాయితీ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశ్యంతో  కొన్ని కోట్ల సంపాద‌న వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అందుచేత ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌కు ఓటు వేసి గెలిపిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here