Home Actor అనుష్క‌తో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న నిశ్శ‌బ్ధం 50 శాతం షూటింగ్ పూర్తి.

అనుష్క‌తో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న నిశ్శ‌బ్ధం 50 శాతం షూటింగ్ పూర్తి.

53
0
అనుష్క‌తో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న నిశ్శ‌బ్ధం 50 శాతం షూటింగ్ పూర్తి. spiceandhra

అనుష్క‌, మాధ‌వ‌న్ కాంబినేష‌న్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్  నిశ్శ‌బ్ధం. దాదాపు 100కి పైగా సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ తొలిసారి ఈ ఇండియ‌న్ మూవీలో న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. తెలుగులో టైటిల్ నిశ్శ‌బ్ధం కాగా మిగిలిన భాష‌ల్లో సైలెన్స్ టైటిల్ తో విడుద‌ల చేయ‌నున్నారు.

 ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో భారీ స్ధాయిలో  ఈ సినిమాని నిర్మిస్తోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ విభిన్న క‌థా చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.ఎస్.ఎ లోని సీయోట‌ల్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌స‌న్, బాహుబ‌లి ఫేమ్ సౌతిండియా లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క‌, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధ‌వ‌న్ తో పాటు సుబ్బ‌రాజు, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జ‌రుగుతోంది. ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నాం అని చిత్ర ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అనుష్క భాగ‌మ‌తి త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డం..ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో ఈ సినిమా రూపొందుతుండ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here