Home Actor అనుష్క‌ నిశ్శ‌బ్ధం పూర్త‌య్యింది. ఇంత‌కీ.. రిలీజ్ ఎప్పుడు..?

అనుష్క‌ నిశ్శ‌బ్ధం పూర్త‌య్యింది. ఇంత‌కీ.. రిలీజ్ ఎప్పుడు..?

18
0
అనుష్క‌ నిశ్శ‌బ్ధం పూర్త‌య్యింది. ఇంత‌కీ.. రిలీజ్ ఎప్పుడు..? spiceandhra

అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం నిశ్శ‌బ్ధం. అనుష్క, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ నిశ్శ‌బ్ధం చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అనుష్క ఇటీవ‌ల న‌టిగా 14 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 15వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా రిలీజ్ చేసిన నిశ్శ‌బ్ధం టైటిల్ పోస్ట‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సీయోట్ లో షూటింగ్ జ‌రుపుకున్న‌ ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…నిశ్శ‌బ్ధం షూటింగ్ పూర్తైంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీని అంద‌రికీ ఎప్పుడెప్పుడు చూపిస్తామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నాను అని నిశ్శ‌బ్ధం టీమ్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు.

ఈ చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ మూవీని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ & మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీర‌జ కోన‌, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ – షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here