Home Actor అనుష్క నిశ్శ‌బ్ధం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

అనుష్క నిశ్శ‌బ్ధం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

28
0
అనుష్క నిశ్శ‌బ్ధం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.! spiceandhra

అందం, అభిన‌యం.. ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది తార‌ల్లో అనుష్క‌ ఒక‌రు. అరుంధ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి.. ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించిన అనుష్క తాజా చిత్రం నిశ్శ‌బ్ధం. మాధ‌వ‌న్ తో క‌లిసి న‌టిస్తున్న ఈ చిత్రంలో దాదాపు 100కి పైగా సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ తొలిసారి ఈ ఇండియ‌న్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో రూపొందుతోన్న‌ ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… అనుష్క జులై 21కి సినిమా రంగంలో ప్ర‌వేశించి 14 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్నాయి. ఈ సంద‌ర్భంగా నిశ్శ‌బ్ధం ఫ‌స్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. తెలుగులో నిశ్శ‌బ్ధం టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీని హాలీవుడ్ లో సైలెన్స్ అనే టైటిల్ తో  రిలీజ్ చేయ‌నున్నారు.

 పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత‌ టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలో హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌స‌న్, బాహుబ‌లి ఫేమ్ సౌతిండియా లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క‌, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధ‌వ‌న్ ల‌తో పాటు సుబ్బ‌రాజు, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here