Home Actor అన్నివర్గాల వారి చూపు జనసేన వైపు

అన్నివర్గాల వారి చూపు జనసేన వైపు

106
0

*జనసేన తరపున ఎన్నికల బరిలో నిలవడానికి విద్యావంతుల ఉత్సాహం

* దరఖాస్తు సమర్సించిన వారిలో 80 శాతం మంది 50 సంవత్సరాల వయస్సు లోపు వారే.

రాజకీయాలలోకి కొత్త తరం రావాలన్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ సంకల్పానికి అనూహ్య స్పందన లభించింది. జనసేన తరపున ఎన్నికల బరిలో నిలుస్తామని ధృడమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ 2410 బయో -డేటాలు సమర్పించగా ఎక్కువ శాతం అభ్యర్థులు రాజకీయాలకు కొత్త వారే..అయితే అందులో రాజకీయ ఉద్దండుల్ని సైతం ఢీ కొట్టగల వారు గణనీయంగా వున్నారు. దరఖాస్తులు సమర్పించిన‌ వారిలో 80 శాతం మంది 50 సంవత్సరాల వయస్సు లోపు వారు కావడం గమనార్హం. ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు బయో-డేటాల స్వీకరణ ప్రక్రియ విజయవాడ నగరంలో జరిగిన సంగతి విదితమే. శాసనసభ ఎన్నికల కోసం 2087 , పార్లమెంట్ కోసం 323 బయో-డేటాలు అందాయి.

రాజకీయాలలోకి మేధావులు,విద్యావంతులు,యువతీ యువకులు రావాలని లేని పక్షంలో మన రాజకీయ వ్యవస్థ దోపిడీదారులతో నిండిపోతుందని శ్రీ పవన్ కళ్యాణ్ మనవి చేస్తూనే వున్నారు. ప్రస్తుతం అందిన బయో-డేటాలు చూస్తుంటే శ్రీ పవన్ కళ్యాణ్  పిలుపుకి ఘనమైన స్పందనే లభించింది. 570 మంది మహిళలు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. 140 మంది న్యాయవాదులు,113 మంది ఐ.టి, ఇంజినీర్లు, 65 మంది డాక్టర్లు,41 మంది లెక్చరర్లు,29 మంది జర్నలిస్టులు,22 మంది ప్రొఫెసర్లు,10 మంది సైనికులు, 8 మంది చార్టెడ్ అకౌంటెంట్లు,ఐ.ఏ.ఎస్.,ఐ.పి.ఎస్. క్యాడర్ లో పని చేసిన ఇద్దరు,న్యాయమూర్తిగా సేవలు అందించిన ఒకరు … పోలీస్,ప్రభుత్వ సర్వీసులలో వున్నవారు ఇలా అనేక రంగాలకు చెందిన వారు  జనసేన తరపున పోటీచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసారు.

అంతేగాకుండా ఎస్.సి.,ఎస్.టి. రిజర్వ్ డ్ సెగ్మెంట్ల నుంచి పోటీచేయడానికి ఉన్నత విద్యావంతులు,ఆడపడుచులు ముందుకు రావడం జనసేన పార్టీ పట్ల ఆవర్గాలలో నెలొకొన్న నమ్మకాన్ని తెలియచేస్తోంది. 659 మంది వ్యాపారవేత్తలు, 169 మంది రైతులు   మేము సైతం జనసేన తరపున పోరు సలుపుతామంటున్నారు. 945 మంది గ్రాడ్యుయేట్లు,720 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 30 మంది పి.హెచ్ డి పట్టభద్రులు దరఖాస్తు చేసిన వారిలో వున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 275 , ఆ తరువాత రెండు స్థానాలలో కృష్ణ నుంచి 256 , గుంటూరు జిల్లా నుంచి 243 బయో-డేటాలు అందాయి. అదే విధంగా అత్యధికంగా  విజయవాడ ఈస్ట్ నుంచి 42 , పిఠాపురం,గుంటూరు ఈస్ట్ నుంచి 29 చొప్పున బయో-డేటాలు సమర్పించారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా  దెందులూరు స్థానం నుంచి పోటీ చేయడానికి ట్రాన్స్ జెండర్ ఒకరు ముందుకు వచ్చారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here