Home Actor అభినందన్ తిరిగి రావడం ఆనందదాయకం – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

అభినందన్ తిరిగి రావడం ఆనందదాయకం – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

69
0

భార‌త వాయుసేన యోధుడు అభినంద‌న్ కోసం కోట్లాది మంది నిరీక్ష‌ణ ఫ‌లించి ఆయ‌న‌ శుక్ర‌వారం రాత్రి 9.15 నిమిషాల‌కు మాతృదేశంలో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వన్ క‌ళ్యాణ్ స్పందిస్తూ…భారత వాయుసేన యోధుడు శ్రీ అభినందన్ మన పుణ్యభూమికి తిరిగి చేరుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అతను సార్ధక నామధేయుడు. జాతి యావత్తు అభినందనలు అందచేసిన దేశ భక్తుడు. శత్రువు చేతికి చిక్కినా మొక్కవోని అతని ధైర్యం అందరినీ అబ్బురపరిచింది. నీ సాహసం, తెగువ ఈనాటి యువతకు ఆదర్శం. జాతి యావత్తు నీ రాక కోసం ఎదురుచూసిన ఈ  తరుణంలో నా తరపున, జనసైనికుల తరపున శుభాబినందనలు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here