Home Political News అభివృద్ధి ఫ‌లాల‌ను కేసీఆర్ ఫ్యామిలీ అనుభ‌విస్తోంది. కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడించాలి – చంద్ర‌బాబు

అభివృద్ధి ఫ‌లాల‌ను కేసీఆర్ ఫ్యామిలీ అనుభ‌విస్తోంది. కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడించాలి – చంద్ర‌బాబు

96
0

తెలంగాణ‌లోని అశ్వ‌రావు పేట‌లో ఈరోజు చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసారు. ఈ ప్ర‌చారంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ…దేశంలో అన్ని పార్టీల‌ను ఏక‌తాటి పైకి తీసుకువ‌స్తున్నాను. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు రాహుల్ తో క‌లిశాను అని చెప్పారు.  తెలంగాణ ధ‌నిక రాష్ట్రం. ఇక్క‌డున్న వ‌న‌రులు ఎక్క‌డా లేవు. అయితే.. తెలంగాణ‌కు ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య కేసీఆరే. కేసీఆర్ ఓ నియంత‌. ఎవ‌రినీ మాట్లాడ‌నివ్వ‌రు. అభివృద్ధి ఫ‌లాల‌ను కేసీఆర్ ఫ్యామిలీ అనుభ‌విస్తోంది. కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడించాలి అని పిలుపునిచ్చారు.

కొండ‌గ‌ట్టులో బ‌స్సు ప్ర‌మాద జ‌రిగినా…బాధితుల‌ను మాత్రం కేసీఆర్ ప‌రామ‌ర్శించ‌లేదు. కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి విస్మ‌రించారు. ఏపీలో 10 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాం అని చెప్పారు. ప్ర‌తి ఇంటికి నీళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతాన‌న్నారు. కానీ..నీళ్లు ఇవ్వ‌కుండానే ఓట్లు ఎలా అడుగుతున్నారు అని ప్ర‌శ్నించారు. హైదారాబాద్ బంగారు గుడ్డు పెట్టే బాతు. అలాంటి హైద‌రాబాద్ ను కేసీఆర్ పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టించారు అని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో ప్రాజెక్టుల నిర్మాణం చేప‌ట్టింది టీడీపీనే. 2014లో ల‌గ‌డ‌పాటి స‌ర్వే చేస్తే టీఆర్ఎస్ నేత‌లు ఆనంద‌ప‌డ్డారు. మూడు నెల‌ల క్రితం కూడా ల‌గ‌డ‌పాటి స‌ర్వే చూసి ఆనంద‌ప‌డ్డారు. ఇప్పుడేమో త‌ప్పుడు స‌ర్వేలంటున్నారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here