Home Political News అమ‌రావ‌తిలో జ‌న‌సేన ఆఫీస్ ప్రారంభం – ప‌వ‌న్, మ‌నోహ‌ర్ ల‌కు స్వాగ‌తం..!

అమ‌రావ‌తిలో జ‌న‌సేన ఆఫీస్ ప్రారంభం – ప‌వ‌న్, మ‌నోహ‌ర్ ల‌కు స్వాగ‌తం..!

98
0

జ‌న‌సేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూత‌న కార్యాల‌యం ఈరోజు ఉద‌యం ప్రారంభ‌మైంది. గాయ‌త్రి న‌గ‌ర్ లో నూత‌న కార్యాల‌యాన్ని పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో వేద‌పండితుల మంత్రోచ్చ‌ర‌ణ‌ల‌తో, పార్టీ కార్య‌క‌ర్త‌ల జ‌య‌జ‌యధ్వానాల మ‌ధ్య కార్యాల‌యంలో అడుగుపెట్టారు. మంగ‌ళహార‌తుల‌తో పార్టీ కార్యాల‌యంలోకి ఆహ్వానించారు. శాస్త్రోక్తంగా గుమ్మ‌డికాయ కొట్టి ప‌వ‌న్ అన్ని గ‌దులు ప్రారంభించారు. అనంత‌రం స‌ర్వ‌మ‌త ప్రార్ధ‌న‌లు నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మాజీ స్పీక‌ర్, పార్టీ ప్ర‌ముఖులు నాదెండ్ల మ‌నోహ‌ర్
హాజ‌ర‌య్యారు. పార్టీ ఉపాధ్య‌క్షుడు మ‌హేంద‌ర్ రెడ్డి, రాజ‌కీయ వ్య‌వ‌హారా క‌న్వీన‌ర్ మాదాసు గంగాధ‌రం, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు తోట చంద్ర‌శేఖ‌ర్, ముత్తంశెట్టి కృష్ణారావు, ముత్తా గోపాల‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాకతో అమరావతికి యువకులు, జనసేన కార్యకర్తలు భారీ స్ధాయిలో త‌ర‌లివ‌చ్చారు.

ప‌వ‌న్.. మనోహర్ తో పాటు పార్టీలోని ఇతర ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప‌వన్ ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న ఐటీ దాడులు, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్షించారు. ఇకపై పార్టీ కార్యకలాపాలు అమరావతి కేంద్రంగా కొనసాగుతాయని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here