Home Actor అమ‌రావ‌తిలో జ‌న‌సేన జెండా ఎగ‌రేస్తాం – రాజ‌మండ్రి జ‌న‌సేన పార్టీ ప్ర‌చారం అత్తి స‌త్య‌నారాయ‌ణ‌

అమ‌రావ‌తిలో జ‌న‌సేన జెండా ఎగ‌రేస్తాం – రాజ‌మండ్రి జ‌న‌సేన పార్టీ ప్ర‌చారం అత్తి స‌త్య‌నారాయ‌ణ‌

103
0


తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి అర్బ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున అత్తి స‌త్య‌నారాయ‌ణ పోటీ చేస్తున్నారు. ఆయ‌న పేరును జ‌న‌సేన పార్టీ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి రాజ‌మండ్రిలో జ‌న‌సేన ప్ర‌చారం మ‌రింత పెరిగింది. జ‌న సైనికులు, కార్య‌క‌ర్త‌లు రెట్టించిన ఉత్సాహాంతో ప్ర‌చారం చేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అత్తి స‌త్య‌నారాయ‌ణ‌ ఓట‌ర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ…త‌న‌ని గెలిపిస్తే రాజ‌మండ్రిని మరింత‌గా అభివృద్ధి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

మా నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు రాజ‌కీయంలోకి వ‌చ్చింది ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి.  కోట్లాది సంపాద‌న వ‌దులుకుని బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు అంద‌రికీ కూడా న్యాయం చేయాల‌నే ఉద్దేశ్యంతో ఈ జ‌న‌సేన పార్టీని పెట్టారు. ఈ పార్టీ సిద్ధాంతాలు.. ఆయ‌న మీద ఉన్న న‌మ్మ‌కంతో  పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి తోడ్ప‌డ్డాను. ఎమ్మెల్యే సీటు వ‌స్తుంద‌ని కానీ..పోటీ చేయాల‌ని కానీ ఆశించి ఈ పార్టీలోకి రాలేద‌ని చెప్పారు. పార్టీకి చేసిన ప్ర‌చారాన్ని గుర్తించి నాకు ఈ అవ‌కాశం ఇచ్చారు. మా నాయ‌కుడికి స‌ర్వ‌దా రుణ‌ప‌డి ఉంటాను.

చంద్ర‌బాబు నాయుడు గారు త‌న కొడుకును సీఎంని చేయాల‌నుకుంటున్నారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ గారు కేసులు మాఫీ చేసుకోవ‌డం కోసం సీఎం అవ్వాల‌నుకుంటున్నారు. కానీ..మా నాయ‌కుడు అలా కాదు. ప్ర‌జాసేవ చేయ‌డానికి వ‌చ్చిన నాయ‌కుడు. అది అంద‌రూ కూడా గ‌మ‌నించి నిస్వార్థంతో సేవ చేయ‌డానికి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి జ‌న‌సేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ పై ఓటు వేసి గెలిపిస్తార‌ని..అమ‌రావ‌తిలో జ‌న‌సేన జెండాను ఎగ‌రేస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here