Home Movie News అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని కాన్సెప్ట్ టీజ‌ర్ రిలీజ్..!

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని కాన్సెప్ట్ టీజ‌ర్ రిలీజ్..!

142
0
DlnC2dCUcAA7iIe

మాస్ మ‌హా రాజా ర‌వితేజ – శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ర‌వితేజ ఫ‌స్ట్ టైమ్ త్రిపాత్రాభిన‌యం చేస్తుండ‌డం విశేషం. ఈ రోజు డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని కాన్సెప్ట్ టీజ‌ర్ రిలీజ్ చేసారు. పివోట్ టీజ‌ర్ పేరిట రిలీజ్ చేసిన ఈ వీడియోలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని అనే ముగ్గురు పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేసారు.

అమర్‌ కాషాయ రంగు దుస్తుల్లో దిగాలుగా ఓ మూలకు కూర్చుని  చూస్తుంటే, అక్బర్‌ భవనంలో నుంచి బైనాక్యులర్‌తో చూస్తూ కన్పించారు. ఆంటోనీ స్టైల్‌గా జీన్స్‌ టీషర్ట్‌ వేసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఇలా..ఈ మూడు పాత్ర‌లు చాలా డిఫ‌రెంట్ గా ఉన్నాయి. టైటిల్‌ని బట్టి చూస్తే ఈ చిత్రంలో రవితేజ హిందువు, ముస్లిం, క్రిస్టియన్‌గా మూడు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ర‌వితేజ‌, శ్రీను వైట్ల ఇద్ద‌రు స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. శ్రీను వైట్ల అండ్ టీమ్ ఈ సినిమా స‌క్స‌స్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. న‌వంబ‌ర్ లో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని  ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. మ‌రి…అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని అంచ‌నాల‌ను ఎంత వ‌ర‌కు అందుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here