Home Movie News అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని టీజ‌ర్ అదిరింది..!

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని టీజ‌ర్ అదిరింది..!

148
0

మాస్ మ‌హా రాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం అమర్ అక్బ‌ర్ ఆంటోని. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ర‌వితేజ‌, శ్రీను వైట్ల ఇద్ద‌రు క‌లిసి స‌క్స‌స్ ఫుల్ మూవీస్ చేసారు. అయితే…ఈమ‌ధ్య కాలంలో వీరి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
అందుచేత‌ ఈ సినిమా విజ‌యం ఇద్ద‌రికీ చాలా కీల‌కం. దీంతో వీరిద్ద‌రు క‌లిసి ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది.

ఈరోజు ఈ మూవీ టీజ‌ర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలుపెట్టాలి అని విలన్‌ చెప్పే మాటలు.. మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న‌ బలం.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్ అని చెప్ప‌చ్చు. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత ర‌వితేజ‌, ఇలియానా క‌లిసి న‌టించ‌డం విశేషం. ఈ టీజ‌ర్ చాలా రిచ్ గా ఉంది. అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. టీమ్ మాత్రం సినిమా విజ‌యం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. న‌వంబ‌ర్ 16న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

Here it is! #AAATeaser @SreenuVaitla @MythriOfficial @MusicThaman @Ileana_Officialhttps://t.co/W04MEvfJVz

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here