Home Movie News అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని డాన్ బాస్కో సాంగ్ అదిరింది..!

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని డాన్ బాస్కో సాంగ్ అదిరింది..!

138
0

మాస్ మ‌హారాజా ర‌వితేజ –  టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ర‌వితేజ స‌ర‌స‌న ఇలియానా న‌టించింది. ఈ సినిమా నుంచి తాజాగా లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. దీపావళి కానుకగా అందించిన ఈ లిరికల్ వీడియో సాంగ్ అదరింది. హే హలో హలో డాన్ బాస్కో .. ఛల్ ఛలో ఛలో పంజూస్కో .. పడిపడి ఎంతైనా ట్రై చేస్కో .. నే దొరకను కాస్కో అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది.

తమన్ అందించిన ఈ బాణీ యూత్ ని హుషారెత్తించేలా వుంది. ఈ పాట‌ను విశ్వ రాయ‌గా… శ్రీకృష్ణ .. జస్ప్రీత్ .. రమ్య బెహ్రా తదితరులు ఆలపించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 10వ తేదీన భారీ స్ధాయిలో జరపనున్నారు. ఇక ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 16వ తేదీన ఈ  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ర‌వితేజ‌, శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో రూపొందిన సినిమాలు విజ‌యం సాధించాయి. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేయ‌డం..ఇందులో ఇలియానా న‌టించ‌డం..టీజ‌ర్ & సాంగ్స్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తుండ‌డంతో పాజిటివ్ టాక్ ఉంది. మ‌రి…అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here