Home Actor అమ‌లాపాల్ కి ఆమె విజ‌యాన్ని అందించేనా..?

అమ‌లాపాల్ కి ఆమె విజ‌యాన్ని అందించేనా..?

36
0
అమ‌లాపాల్ కి ఆమె విజ‌యాన్ని అందించేనా..? spiceandhra

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి అమలాపాల్. ఆమె న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ సినిమా ఆమె. ఆకట్టుకునే థ్రిల్లింగ్ బ్యాక్ డ్రాప్ లో మంచి సస్పెన్స్ జోన‌ర్  లో సాగే ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇక ఈ చిత్ర తమిళ టీజర్‌ను బాలీవుడ్ దర్శకుడు కరణ్‌ జోహార్‌ విడుదల చేయగా తెలుగు టీజర్‌ను  సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రిలీజ్ చేశారు. తమిళంలో ‘ఆడై’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆమె’ పేరుతో విడుదల చేస్తున్నారు.

తమిళ చిత్రం ‘మయాతా మాన్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ‘వి స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. భిన్న‌మైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమ‌లా పాల్ బోల్డ్ లుక్  సంచ‌ల‌నం సృష్టించింది.

 ఇక ఈ చిత్రాన్ని జులై 19న విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌దీప్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విజ‌య్ కార్తిక్ ఖ‌న్న‌న్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఈ చిత్రం తెలుగు హ‌క్కులను సొంతం చేసుకుని చ‌రిత చిత్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో ఆమె చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మ‌రి..అమ‌లాపాల్ కి ఆమె చిత్రం విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here