Home Movie News అర‌వింద స‌మేత ట్రైల‌ర్ అదిరింది కానీ..!

అర‌వింద స‌మేత ట్రైల‌ర్ అదిరింది కానీ..!

87
0
ntr

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు ఈ నెల 11న వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్ లో గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో అర‌వింద స‌మేత ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ రిలీజ్ చేసారు.

ఎన్టీఆర్,  పూజా హెడ్గేల పై  క్యూట్ మూమెంట్స్‌తో ట్రైల‌ర్ స్టార్ట్ అయ్యింది. నీకు ఫ్యాక్ష‌న్ అంటే తెలుసా అంటూ పూజా హెడ్గే అడిగిన ప్ర‌శ్న‌తో – ఈ క‌థ ఫ్యాక్ష‌న్ వైపు మ‌లుపు తీసుకుంది. మీ తాత క‌త్తి ప‌ట్టినాడంటే అది అవ‌స‌రం, మీ నాన్న క‌త్తి ఎత్తినాడంటే అది వార‌స‌త్వం, నువ్వు క‌త్తి దూసినావంటే అది ల‌క్ష‌ణం, ఆ క‌త్తి నీ బిడ్డ నాటికి లోపం అవ‌తుందేమో.. అనే త్రివిక్ర‌మ్ స్టైల్ డైలాగ్ తో ఈ సినిమాలో హీరో ల‌క్ష‌ణం ఏమిటి? అనేది చెప్పేసారు.

వాడిదైన రోజున ఎవ‌డైనా కొడ‌తాడు. అస‌లు గొడ‌వ జ‌ర‌క్కుండా ఆపుతాడు చూడు.. వాడే గొప్ప అనే క‌థానాయిక డైలాగ్ తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది తెలియ‌జేస్తోంది. ఫ్యామిలీ ఎమోష‌న్స్, యాక్ష‌న్, ఫ్యాక్ష‌న్..ఇలా అన్ని అంశాలు ఇందులో ఉన్నాయ‌నిపిస్తోంది. సో..ట్రైల‌ర్ అదిరింది అని చెప్ప‌చ్చు కానీ..పాత సినిమాల‌ను గుర్తు చేస్తుంది. మ‌రి..త్రివిక్ర‌మ్ మ్యాజిక్ ఎంత వ‌ర‌కు స‌క్స‌స్ అవుతుందో..ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here