Home Movie Reviews అర‌వింద స‌మేత… వీర రాఘ‌వ రివ్యూ..!

అర‌వింద స‌మేత… వీర రాఘ‌వ రివ్యూ..!

220
0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ క‌లిసి 12 సంవ‌త్స‌రాల నుంచి సినిమా చేయాల‌నుకుంటున్నారు. ఆఖ‌రికి ఇన్నాళ్ల‌కు కుదిరింది. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే… ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత కొన్ని ఫ్యాక్ష‌న్ నేప‌ధ్యంలో తీసిన సినిమాలు గుర్తొచ్చాయి.

గ‌తంలో వ‌చ్చిన ఫ్యాక్ష‌న్ చిత్రాల‌తో పోలిస్తే..ఇందులో ఉన్న కొత్త‌ద‌నం ఏంటి అని త్రివిక్ర‌మ్ ని క‌థ గురించి అడిగితే..యుధ్దం గురించి మాట్లాడుకుంటాం కానీ..యుద్ధం త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది మాట్లాడుకోం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం జ‌రిగింద‌నే అంశం పై పుస్తకాలు వచ్చినా వాటికి ఆదరణ లభించలేదు. అందుచేత‌ యుద్ధంలో గెలిచిన వాడి పరిస్థితి ఏంటి..?  ఓడినవాడి మాన‌సిక ప‌రిస్థితి ఏంటి..? చనిపోయిన వారి కుటుంబాల సంగతేంటి..?  అనే పాయింట్ తో ఈ సినిమాను తెర‌కెక్కించానని చెప్పారు. భారీ అంచ‌నాలతో అర‌వింద స‌మేత వీర రాఘ‌వ ప్ర‌పంచ వ్యాప్తంగా ఈరోజు (అక్టోబ‌ర్ 11) రిలీజైంది. మ‌రి.. అర‌వింద స‌మేత అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుందా..?  లేక కొంద‌ర్నే ఆక‌ట్టుకుంటుందా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే..!

క‌థ – రాయ‌ల‌సీమ‌లోని న‌ల్ల‌గుడి, కొమ్మ‌ద్ది అనే రెండు గ్రామాల మ‌ధ్య జ‌రిగే ఫ్యాక్ష‌న్ క‌ధ‌. న‌ల్ల‌గుడి ఊరి పెద్ద బ‌సిరెడ్డి (జ‌గ‌ప‌తిబాబు), కొమ్మ‌ద్ది ఊరి పెద్ద నార‌ప‌రెడ్డి (నాగేంద్ర‌బాబు) వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ రెండు ఊరుల మ‌ధ్య గొడ‌వ అవుతుంది. ముప్పై సంవ‌త్స‌రాల నుంచి ఈ గొడ‌వ‌లు ఇలాగే ఉంటాయి. లండ‌న్ లో ఉన్న నార‌ప‌రెడ్డి కొడుకు వీర రాఘ‌వ రెడ్డి (ఎన్టీఆర్) ఊరికి వ‌స్తాడు. ఈ విష‌యం తెలుసుకుని బ‌సిరెడ్డి, అత‌ని మ‌నుషులు నార‌ప‌రెడ్డి, వీర రాఘ‌వ‌రెడ్డి పై దాడి చేస్తారు. ఈ గొడ‌వ‌ల్లో నార‌ప‌రెడ్డి చ‌నిపోతాడు. అంతే..ఆవేశంతో వీర రాఘ‌వ రెడ్డి బసిరెడ్డి, అత‌ని మ‌నుషుల‌ను న‌రికేస్తాడు. ఆత‌ర్వాత బామ్మ మాట‌ల‌తో ఆలోచ‌న‌లో ప‌డిన వీర రాఘ‌వ‌రెడ్డి ఊరికి దూరంగా హైద‌రాబాద్ లో ఉంటాడు. అక్క‌డ నీలాంబ‌రి (సునీల్) ప‌రిచ‌యం అవుతాడు. ఆత‌ర్వాత వీర రాఘ‌వ‌రెడ్డి నీలాంబ‌రి మెకానిక్ షెడ్ లో ఉన్న‌ప్పుడు అర‌వింద (పూజా హేగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. ఆమె ఓ సంద‌ర్భంలో అస‌లు గొడ‌వే జ‌ర‌గ‌కుండా ఆపుతాడు చూడు వాడు గొప్ప అని చెబుతుంది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ వీర రాఘ‌వ‌రెడ్డి రెండు గ్రామాల మ‌ధ్య గొడ‌వ‌లు లేకుండా ప్ర‌శాంతంగా ఉండాల‌ని కోరుకుంటాడు. ఈ క్ర‌మంలో ఏం చేసాడు..?  త‌ను అనుకున్న‌ది మార్పు వ‌చ్చిందా..?  లేదా..?  అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

ఎన్టీఆర్, జ‌గ‌ప‌తి బాబు న‌ట‌న‌

త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు

త‌మ‌న్ సంగీతం

యాక్ష‌న్ సీన్స్

మైన‌స్ పాయింట్స్

పాత క‌థ‌

కామెడీ త‌క్కువుగా ఉండ‌డం

విశ్లేష‌ణ – వీర రాఘ‌వ రెడ్డి పాత్ర‌లో..కంటపడితే కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా అంటూ ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో అద్భుతంగా న‌టించి శ‌భాష్ అనిపించాడు. వీర రాఘ‌వ రెడ్డిగా సిక్స్ ప్యాక్ లో క‌నిపించి ఫ్యాన్స్ ని బాగా ఆక‌ట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే …ఎన్టీఆర్ ని అభిమానులు ఎలా చూడాల‌నుకుంటారో అలా చూపించారు త్రివిక్ర‌మ్. సినిమా స్టార్ అయిన ప‌స్ట్ 20 మినిట్స్ లో చూపించిన యాక్ష‌న్ ఎపిసోడ్ తో ఆడియ‌న్స్ క‌ట్టిప‌డేసారు. ఆత‌ర్వాత వ‌చ్చే వీర రాఘ‌వ‌రెడ్డి, అర‌వింద‌ల ప్రేమ రోటీన్ గా సాగుతూ కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. ఆత‌ర్వాత మ‌ళ్లీ ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ తో ఆక‌ట్టుకుంటాడు వీర రాఘ‌వ‌రెడ్డి. సెకండాఫ్ లో వ‌చ్చే సీన్స్ స్లోగా అనిపించినా..ప్రీ క్లైమాక్స్ నుంచి మ‌ళ్లీ స్పీడు అందుకుంటుంది.

ఎన్టీఆర్ త‌ర్వాత చెప్పుకోవాల‌సిన క్యారెక్ట్ అంటే జ‌గ‌ప‌తిబాబు. బ‌సిరెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు జీవించేసాడు. త్రివిక్ర‌మ్ సినిమా అంటే..కామెడీ ఎక్కువుగా ఎక్స్ పెక్ట్ చేస్తారు కానీ…ఇందులో కామెడీ అంత‌గా లేదు. నీలాంబ‌రి పాత్ర‌లో సునీల్ క‌నిపించిన‌ప్ప‌టికీ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగానే చూపించారు కానీ..అత‌నితో కామెడీ చేయించ‌లేదు. త‌మ‌న్ సంగీతం ఈ సినిమా ప్ల‌స్ పాయింట్స్ లో ఒక‌టి. స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్ర‌ఫీ, రామ్ ల‌క్ష్మ‌ణ్ యాక్ష‌న్ సీన్స్, న‌వీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. హ‌రిక & హాసిని ఏమాత్రం రాజీ ప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

న‌వీన్ చంద్ర బ‌సిరెడ్డి కొడుకు పాత్ర‌లో చాలా బాగా న‌టించాడు.ఈషా రెబ్బా పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేదు. న‌రేష్, సితార‌, నాగ‌బాబు, రావు ర‌మేష్, శుభ‌లేక సుధాక‌ర్, న‌వీన్ చంద్ర‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. త్రివిక్ర‌మ్ మార్క్ డైలాగులు ఆక‌ట్టుకున్నా…ఈ త‌ర‌హా ఫ్యాక్ష‌న్ సినిమాలు చూసి ఉండ‌డంతో.. కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఇందులో ఏదో మిస్ అయ్యింద‌నే ఫీలింగ్ క‌లిగిస్తుంది.అర‌వింద స‌మేత గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…అంద‌రూ బాగుండాల‌ని కోరుకునే అర‌వింద స‌మేత..ఆక‌ట్టుకుంటుంది మాత్రం కొంద‌రినే..!

రేటింగ్ – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here