Home Actor అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో..కీర‌వాణి. ఏం చేస్తున్నారో తెలుసా..?

అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో..కీర‌వాణి. ఏం చేస్తున్నారో తెలుసా..?

83
0


తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఎన్నో మ్యూజిక‌ల్ హిట్స్ అందించిన సంగీత సంచ‌ల‌నం స్వ‌ర‌వాణి కీర‌వాణి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించే సినిమాల‌కు సంగీతం కీర‌వాణి అందిస్తార‌నే విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాలు మ్యూజిక‌ల్ హిట్స్ గా నిలిచాయి. రాజ‌మౌళి తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ తెర‌కెక్కిస్తున్నారు. డి.వి.వి. దాయ‌న్య ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి కూడా కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. ఈ విష‌యాన్ని కీర‌వాణి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఈ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతూ ఉండటంతో, మ్యూజిక్ సిటింగ్స్ అక్కడే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here