Home Actor అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్..!

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్..!

131
0

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ మ‌రియు హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీత అందిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.

హైదరాబాద్ బేగంపేట పోలీస్ లైన్స్ లో తొలి షెడ్యూల్ షూటింగును ఆరంభించారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో టబు, బొమన్ ఇరాని, సుశాంత్, నవదీప్ కనిపించనున్నారు. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల‌తో విజ‌యాలు సాధించిన బ‌న్నీ, త్రివిక్ర‌మ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తార‌ని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here