Home Actor అల్లు అర్జున్ 16 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ..! ఇంత‌కీ..లేటెస్ట్ మూవీ ఎప్పుడు..?

అల్లు అర్జున్ 16 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ..! ఇంత‌కీ..లేటెస్ట్ మూవీ ఎప్పుడు..?

68
0


స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి..తొలి చిత్రంతోనే విజ‌యం సాధించాడు. ఆత‌ర్వాత ఆర్య సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ గా బిగ్ హిట్ సాధించి మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. బ‌న్నీ, హ్యాపీ, దేశ‌ముదురు, ప‌రుగు, ఆర్య 2 చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.  వేదం, బ‌ద్రీనాథ్, జులాయి, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, రేసుగుర్రం, ఎవ‌డు, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవి, స‌రైనోడు, డీజే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా..ఇలా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ..స్టార్ స్టేట‌స్ సొంతం చేసుకుని కెరీర్ లో దూసుకెళుతున్నాడు.

యాక్టింగ్ లో, డ్యాన్స్ ల‌లో, ఫైట్స్ లో అద్భుతంగా న‌టిస్తూ..అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. అందుక‌నే తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళం, త‌మిళ‌, క‌న్న‌డ ప్రేక్ష‌కులు కూడా అల్లు అర్జున్ ని ఎంత‌గానో ఆద‌రిస్తున్నారు. మ‌ల‌యాళ ప్రేక్ష‌కులు అల్లు అర్జున్ ని మ‌ల్లు అర్జున్ అని పిలుస్తున్నారంటే…వాళ్ల‌ని ఎంత‌గా ఆక‌ట్టుకున్నాడో అర్ధం చేసుకోవ‌చ్చు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో క‌థ‌ల విష‌యంలో కేర్ తీసుకుంటున్న బ‌న్నీ…చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ చెప్పిన క‌థ‌కు ఓకే చెప్ప‌డం..ఈ మూవీని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌డం తెలిసిందే.

ఇదిలా ఉంటే…అల్లు అర్జున్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 16 సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో మూవీని నిర్మిస్తోన్న హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌  శ్రీనివాస్‌ ల కాంబినేషన్‌ పై ఫ్యాన్స్ తో పాటు మేం కూడా చాలా ఆత్రుతగా ఉన్నాం. ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే పనులు ఉన్న కారణంగా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేకపోతున్నాం. అన్నీ కుదిరిన తరువాత సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here